ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నేటితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ వేడుకల్లో రాష్ట్ర రోడ్డు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని.. జలహారతి ఇచ్చారు. ప్రాజెక్టు వద్ద ఫ్లడ్ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ (స్కాడా)ను మంత్రి ప్రారంభించారు.
Bhola Shankar: మెగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. చిరు కోసం చెర్రీ
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. 40 కోట్లతో 4 లక్షల ఎకరాల కోసం 1963లో ఎస్సారెస్పికి అంకురార్పణ జరిగిందని తెలిపారు.1983లో రిజర్వాయర్ లో నీరు నింపారన్నారు. 2015లో పది లక్షల ఎకరాల అయకట్టుకు నీళ్లు అందిచేలా పనులు జరిగాయని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై అన్యాయం జరిగిందని ఆయన తెలిపారు. ఎస్సారెస్పికి రివర్స్ పంప్ ద్వారా నీరు వస్తుందా అని సందేహలు వ్యక్తం చేశారు. పునర్జీవ పథకం ద్వారా కాళేశ్వరం జలాలు శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి తీసుకొచ్చామన్నారు. ఎస్సారెస్పీ ద్వారా 18 లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రణాళికలు చేశామని.. ప్యాకేజీ 21, 22 ద్వారా ఉమ్మడి జిల్లాలోని గ్రామాలకు కాళేశ్వరం జలాలను త్వరలో అందిస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి భరోసానిచ్చారు. దీంతో
పునర్జీవ పధకంతో రైతులకు భరోసా వచ్చింది.
Visakhapatnam: 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. విశాఖ కోర్టు సంచలన తీర్పు
60 ఏళ్లుగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సాగు, తాగు నీరు అందిస్తోంది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు. 1983లో టీడీపీ సర్కారు హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాని నిర్మాణం 1988లో పూర్తి కాగా.. ఆయనే ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. భారీగా కురిసిన వర్షాల వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 90వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో 807 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 10వందల 91 అడుగులు కాగా, ప్రస్తుతం 10వందల 85 అడుగుల నీటిమట్టం ఉంది.