భాగ్యనగరంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాల సందడి షురూ అయ్యింది. ఈసారి జరిగే బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బోనాల జాతర నిర్వాహణ,ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బోనాల జాతర ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాల ఏర్పాట్లపై…
రంగారెడ్డి జిల్లాలో 12యేళ్ల బాలికకు 35యేళ్ల వ్యక్తితో వివాహం జరిగింది. అదీ బర్త్ డే చేస్తున్నామన్న పేరుతో తల్లిదండ్రులు ఆమెకు వివాహం జరిపించారు. దీంతో పోలీస్ కేసు నమోదయ్యింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో బాల్య వివాహం జరిపించారు. 12 ఏండ్ల వయసున్న బాలికను 35 ఏండ్ల వ్యక్తికి కట్టబెట్టారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా.. పుట్టిన రోజు వేడుక పేరుతో ఈ వివాహ వేడుకను నిర్వహించారు తల్లిదండ్రులు. అయితే తనకు ఈ పెళ్లి…
తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీలో వెలుగెత్తి చాటిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. 40 నలభై వసంతాల తెలుగుదేశం ఆవిర్భావ వేడుకల లోగోను ఆవిష్కరించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది. తెలుగుజాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. తెలుగు వారికి గుర్తింపు లేనప్పుడు టీడీపీ ఆవిర్భవించింది. రూ. 2కే కిలో బియ్యం ద్వారా ఆహార భద్రత, పక్కా ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఇళ్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ పథకాలే…
అతనో తహశీల్దార్..అయితేనేం డ్యాన్సర్ లకు ధీటుగా డ్యాన్స్ వేస్తూ అలరించారు. నూతన సంవత్సరం వేడుకల్లో రచ్చరంబోలా చేశారు. చిరంజీవి స్టెప్పులతో డ్యాన్స్ తో గోలీమార్ అంటూ అందరినీ అలరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన తాహశీల్దార్. ఖమ్మం జిల్లా కల్లూరు మండల రెవెన్యూ అధికారిగా మంగీలాల్ విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం రెవిన్యూ పరిధిలో పనులతో బిజీగా గడిపే తహశీల్దార్ నూతన సంవత్సర వేడుకల్లో తనదైన స్టైల్ లో డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నారు. మంగీలాల్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా లోని…
ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్త సంవత్సరం వేడుకలు మొదట న్యూజిలాండ్‌లో ప్రారంభం అయ్యాయి. న్యూజిలాండ్ రాజధాని అక్లాండ్‌లో కొత్త సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలికారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ స్వాగతం పలికారు. కొత్త సంవత్సరంలో కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టాలని, మళ్లీ పూర్వం రోజులు రావాలని, ప్రపంచంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని ప్రజలు కోరుకుంటూ సంబరాలు చేసుకున్నారు. Read: విమానంలో ప్రయాణం చేస్తున్న మహిళకు కరోనా……
వ్యాపారవేత్తగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా వీడియోలు పోస్ట్ చేసే వారిలో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఆయన సోస్ట్ చేసే వీడియోలు తప్పకుండా వైరల్ అవుతుంటాయి. తాజాగా క్రిస్మస్ వేడుకలపై ఓ వీడియోను పోస్ట్ చేశారు. లక్షల పదాల కంటే చిన్న వీడియో చాలా శక్తివంతమైనదని, హంగు ఆర్బాటం, ఆడంబరాలు లేకున్నా పిల్లలు చేసుకుంటున్న క్రిస్మస్ వేడుకలు చాలా గొప్పవని అన్నారు. ఆఫ్రికా ఖండంలోని పిల్లలు ఎలాంటి సౌకర్యాలు లేకున్నా క్రిస్మస్ వేడుకలను…
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. డెల్టా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా, ఒమిక్రాన్ వ్యాప్తిని, తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దేశంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు విధించారు. మహారాష్ట్రలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంతల వరకు నేట్ కర్ఫ్యూ ను అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలోనే అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు, డెల్టా కేసులు నమోదవుతున్నాయి. హర్యానా, గుజరాత్‌లో రాత్రి 11 గంటల…
గత రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రపంచంలోని 70 శాతం మంది జనాభా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి ప్రపంచం మెల్లిగా బయటపడుతున్నది. కొన్ని దేశాల్లో మినహా చాలా చోట్ల కరోనా కంట్రోల్‌లోకి వచ్చింది. అత్యధిక జనాభా కలిగిన ఇండియాలో సైతం కరోనా కంట్రోల్‌లోకి వచ్చింది. వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడమే ఇందుకు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. కరోనా కంట్రోల్‌లోకి రావడంతో ఇప్పటి వరకు ఇళ్లకే పరిమితమైన ప్రజలు క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలను పెద్ద…