కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా 33 మంది పెన్షన్ దారులు చనిపోయారని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.
ఎన్నికల కోడ్ ముగిసే వరకు డీఎస్సీని వాయిదా వేయాలని సీఈసీ స్పష్టం చేసేంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ పరీక్షా ఫలితాల విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆంక్షలు విధించింది. పెన్షన్లు సహా లబ్దిదారులకు నగదు పంపిణీ వంటి కార్యక్రమాల అమలుకు వాలంటీర్లను దూరంగా పెట్టాలని సీఈసీ సూచించింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మే 13న అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్ సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ విడుదల చేసింది. ఈసీ ప్రకటనతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం రెడీగా ఉంది. ఎన్నికల కమినషన్ కు నిన్న ( బుధవారం ) ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ (శుక్రవారం) ఉదయం వాళ్లు తమ బాధ్యతలు స్వీకరించారు.
గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకి ఎన్నికల విధుల కేటాయింపుపై ఎన్నికల సంఘం(సీఈసీ) స్పష్టత ఇచ్చింది. ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బంది నియామకానికి సీఈసీ నో అబ్జెక్షన్ తెలిపింది.
కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఇటీవల జరిగిన డీఎస్పీల బదిలీలపై సీఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్దిచేకూరేలా డీఎస్పీల బదిలీలు ఉన్నాయని సీఈసీకి ఆయన కంప్లైంట్ చేశారు. అధికార వైసీపీకి అనుకూలంగా ఉన్నారంటూ 10 మంది డీఎస్పీల పేర్లను సీఈసీ దృష్టికి టీడీపీ ఏపీ చీఫ్ తీసుకెళ్లారు. డీఎస్పీలపై ఉన్న అభియోగాలనూ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి అచ్చెన్నాయుడు తీసుకెళ్లారు. ‘వైసీపీకి అనుకూలంగా ఉండే…