TDP: కేంద్ర ఎన్నికల కమిషన్‌కి టీడీపీ లేఖ.. ఆయన్ని బదిలీ చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP: కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ మరో లేఖ రాసింది.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ డి. వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని సీఈసీని లేఖలో కోరారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ఉత్పత్తి చేస్తున్న డిస్టిలరీలు ఎక్కువ శాతం అధికారపార్టీ నాయకుల ఆధీనంలో ఉన్నాయి. మద్యం ఉత్పత్తి నుంచి అమ్మకాలు వరకు మొత్తం ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తోంది. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఓటర్లకు లిక్కర్ పంపిణీ చేసేందుకు అధికారపార్టీ వైసీపీ నాయకులు ఇప్పటికే పెద్దఎత్తున స్టాక్ పెట్టుకున్నారు. ఇందుకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, ఎక్సైజ్ శాఖ, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తోందని లేఖలో కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
Also Read
- Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
- Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
- Pakistan Airspace Ban: భారత విమానాలపై పాకిస్తాన్ ఆంక్షలు.. గగనతల నిషేధం పొడిగింపు..
- Ravi Kishan: ‘‘జెన్-జీ భారతదేశ ఆత్మ’’.. CJPకి యువతతో సంబంధం లేదు..
ఇక, ప్రభుత్వ ఔట్లెట్స్‌లలో లిక్కర్ అమ్మకాలు చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం వైసీపీకి చెందిన కార్యకర్తలే. వైసీపీ మీటింగులకు ప్రజలను ప్రలోభపెట్టి తీసుకెళ్లేందుకు అధికార పార్టీ నాయకులు ఇప్పటికే లిక్కర్ పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన ఐ.ఆర్.టి.ఎస్ అధికారి డి. వాసుదేవ రెడ్డికి రాష్ట్రంలోని అధికార పార్టీ లిక్కర్ మాఫియాతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న లిక్కర్ కుంభకోణంలో ఇతను కీలక పాత్ర పోషిస్తున్నారు. రానున్న ఎన్నికలు ప్రశాతంగా జరగాలంటే లిక్కర్ మాఫియాతో సంబంధాలున్న వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న లిక్కర్ అమ్మకాలపై, రవాణపై నిఘా పెట్టాలి. మద్యం ఉత్పత్తి చేస్తున్న డిస్టిలరీలలో సైతం ప్రత్యేక అధికారులను పెట్టి మానిటర్ చేయాలి. అధికార పార్టీ నాయకులు ఇప్పటికే గోడౌన్‌ల్లో దాచి పెట్టిన లిక్కర్ స్టాక్‌లపై దాడులు చేసి సీజ్ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ ద్వారా విన్నవించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
తాజావార్తలు
-
Poco X8s: 12GB RAM, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో Poco X8s? లీకైన వివరాలు ఇవే!
-
Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
-
Ferrari Luce: భారత్‌లోకి ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. 2.5 సెకన్లలో 100 km/h స్పీడ్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!