కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఇటీవల జరిగిన డీఎస్పీల బదిలీలపై సీఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్దిచేకూరేలా డీఎస్పీల బదిలీలు ఉన్నాయని సీఈసీకి ఆయన కంప్లైంట్ చేశారు. అధికార వైసీపీకి అనుకూలంగా ఉన్నారంటూ 10 మంది డీఎస్పీల పేర్లను సీఈసీ దృష్టికి టీడీపీ ఏపీ చీఫ్ తీసుకెళ్లారు. డీఎస్పీలపై ఉన్న అభియోగాలనూ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి అచ్చెన్నాయుడు తీసుకెళ్లారు.
‘వైసీపీకి అనుకూలంగా ఉండే డీఎస్పీలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బదిలీ చేశారు. తాజాగా చేపట్టిన 42 మంది డీఎస్పీల బదిలీలపై విచారణ చేపట్టాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించాలని బదిలీ అయిన డీఎస్సీలకు డీజీపీ స్పష్టంగా చెప్పారు’ అని కేంద్ర ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసిన లేఖలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Also Read: AP News: రుణ వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య!
ఫిర్యాదులో పేర్కొన్న డీఎస్పీల పేర్లు:
సుధాకర్ రెడ్డి, రాంబాబు, ఉమా మహేశ్వర రెడ్డి, వీర రాఘవరెడ్డి, సి.మహేశ్వర్ రెడ్డి, మురళీకృష్ణా రెడ్డి, నారాయణ స్వామి రెడ్డి, శ్రీనాధ్, రాజ్ గోపాల్ రెడ్డి, హనుమంత రావు.