రాజ్యసభలో విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక బిల్లును ఆమోదించుకుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల సెలక్షన్ కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు కేంద్రమంత్రి ఉండనున్నారు.
Telangana Elections: తెలంగాణాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం పోలింగ్ మందకొడిగా జరుగగా.. 11 గంటల వరకు 20.64 శాతం నమోదైంది.
ఢిల్లీలో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులతో సీఈసీ భేటీ అయింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్‌తో పాటు మిజోరాం ఎన్నికల పరిశీలకులతో అనేక అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్చించింది.
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటిస్తుంది. సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈరోజు నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల బృందాన్ని సీపీఎం నేతలు కలిశారు. రాష్ట్రంలో గతంలో జరిగిన ఎన్నికల తీరుపై వారికి వివరించారు.
కర్ణాటకలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఉప ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఉప ఎన్నికలు జూన్ 30న జరుగుతాయని తెలిపింది.
Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయమే ఉండటంతో సన్నాహక చర్యలపై ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలోని భారత ఎన్నికల సంఘానికి చెందిన ముగ్గురు సీనియర్ అధికారుల బృందం శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తో పాటు పలువురు ఎన్నికల అధికారులతో సమావేశం అయ్యారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) బుధవారం ప్రకటించింది. మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.