Odisha Train Accident: మూడు దశాబ్ధాల కాలంలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా మిగిలిన ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటనపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ఘటనలో విద్రోహ కోణం ఏమైనా ఉందా..? లేకపోతే సాంకేతిక లోపమా..? అనే అంశాలపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విపక్షాలు ఈ రైలు ప్రమాదంపై సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రైల్వే బోర్డు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో విచారణ చేయించాలని కోరింది. ప్రస్తుతం రెస్క్యూ పూర్తయిందని, పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, ట్రాక్ కు సంబంధించిన పనులు పూర్తికాగా.. ఓవర్ హెడ్ వైరింగ్ పనులు కొనసాగుతున్నాయని, గాయపడిన ప్రయాణికులు చికిత్స పొందుతున్నారని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
Read Also: Operation Malamaal: ఢిల్లీ జంట హత్యల కేసులో పురోగతి.. మిలియనీర్ కావాలనే హత్యలు
శుక్రవారం సాయంత్ర ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ సమీపంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఆగిఉన్న గూడ్స్ రైలును ఢికొట్టింది. మెయిన్ ట్రాక్ నుంచి వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్ లో ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోరమాండల్ రైలు బోగీలు పక్కన ఉన్న పట్టాలపై పడ్డాయి. ఇదే సమయంలో బెంగళూర్- హౌరా యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ ట్రాక్ పై పడి ఉన్న బోగీలను ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ప్రమాదంలో 270 కన్నా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.
#WATCH | Railway Board recommends CBI probe related to #OdishaTrainAccident, announces Railways minister Vaishnaw pic.twitter.com/X9qUs55fZr
— ANI (@ANI) June 4, 2023