మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఢిల్లీ పెద్దలదే అన్నారు టీడీపీ నేత బోండా ఉమా. గతంలో జయలలిత కేసు కర్ణాటకలో విచారణ జరిగినట్లు వివేకా హత్య కేసు విచారణ వేరే రాష్ట్రంలో చేపట్టాలి. వివేకా హత్య కేసు నిందితుల్ని కాపాడేందుకు వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల్ని సైతం నాశనం చేసే తీరు చూసి దేశం మొత్తం నివ్వెరపోతోంది.
బాబాయ్ హత్యకేసు వెలికితీస్తున్న సీబీఐ అధికారులపై పోలీసులతో కేసు పెట్టించిన సీఎం జగన్ చరిత్రకెక్కారు.తాడేపల్లి ఆదేశాలు సీబీఐ పాటించట్లేదని వారిపైనే కక్షకట్టారు.ఇవాళ రాం సింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. రేపు హత్య చేసినా ఆశ్చర్యం లేదు. వివేకాహత్య కేసు విచారిస్తున్న సీబీఐ అధికారుల ఫోన్ నెంబర్లు ఏపీ పోలీసుల ద్వారా తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు సేకరిస్తున్నారు.
జగన్నాటకం లో అవినాష్ రెడ్డిని కాపాడేందుకు తాడేపల్లి నుంచి ఢిల్లీ వరకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పోలీసులంతా కుమ్మక్కై తాడేపల్లి ఆదేశాలు పాటిస్తున్నారు. సీబీఐ పై కేసు పెట్టిన ఉదయ్ కుమార్ రెడ్డిని ఎందుకు విచారించాలో వివేకా కుమార్తె హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి హత్యకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయన్నారు బోండా ఉమా.