YS Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది.. ఈ కేసులో తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసు సిబ్బందిపై తాజాగా చర్యలు ప్రారంభమయ్యాయి. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు రాజశేఖర్, అలాగే సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ పై తప్పుడు కేసులు నమోదు చేసిన ఇద్దరు పోలీసు అధికారులపై కేసులు నమోదైనట్లు సమాచారం.…
Karur stampede: తమిళ స్టార్ యాక్టర్, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ నిర్వహించిన కరూర్ ర్యాలీ విషాదంగా మారిన సంగతి తెలిసిందే. తొక్కసలాట జరిగి ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ సంఘటనపై ప్రాథమిక వివరాలు కోరడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.
Fake PMO Letter Scam: సైబర్ క్రిమినల్స్ తీరుకు అంతే లేకుండా పోతోంది. ఓ వ్యక్తి.. తాను చీటింగ్ చేయడం కోసం ప్రధాన మంత్రి కార్యాలయాన్ని వాడుకుంటున్నాడు. ఏకంగా పీఎంఓ అధికారినంటూ లేఖలు పంపుతున్నాడు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రభుత్వ సంస్థలను మోసం చేసేందుకు ప్రయత్నించాడు. ఇటీవల 2025 మే 1న డాక్టర్ పి. రామారావు పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ లేఖ వచ్చింది. అందులో పి. రామారావు.. తనను తాను న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో…
Tamil Nadu: గత నెలలో కస్టడీలో అజిత్ కుమార్ అనే 27 ఏళ్ల వ్యక్తి కస్టడీలోనే మరణించడం సంచలనంగా మారింది. తమిళనాడులో జరిగిన ఈ సంఘటనపై అక్కడి డీఎంకే ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహానికి కారణమైంది. దొంగతనం కేసులో ఆలయ సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్‌ని కస్టడీలో పోలీసులు దారుణంగా కొట్టడం, చిత్రహింసలు పెట్టడంతో మరణించారు.
సిబ్బంది లేరు.. ఫ్యాకల్టీ లేదు.. డాక్టర్లు అంతకంటే కూడా లేరు.. కేవలం అద్దె ప్రాతిపదికన డాక్టర్లను తీసుకువచ్చి తనిఖీల సమయంలో తూతూ మంత్రంగా వ్యవహరించి పంపించి వేస్తున్నారు.. అద్దె డాక్టర్లు అద్దె సిబ్బంది తో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారులను మభ్య పెడుతున్నారు ..అయితే అక్కడితో సరిపోయేది.. మెడికల్ కాలేజీల అనుమతి కోసం ఏకంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ సిబ్బందికి లంచాలు ఇస్తున్నారు ..అది కూడా కోట్లల్లో డబ్బులు చెల్లిస్తున్నారు. ఆంధ్ర నుంచి ఢిల్లీ వరకు ఈ…
MK Stalin: తమిళనాడులో 27 ఏళ్ల అజిత్ కుమార్ పోలీస్ కస్టడీలో మరణించిన ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును విచారిస్తూ హైకోర్టు ప్రభుత్వంపై విరుచుకుపడింది. ‘‘హంతకుడు కూడా ఇంత ఘోరంగా దాడి చేయడు. పోలీసులు అధికార మత్తులో ఉన్నారు. రాష్ట్రమే తన సొంత పౌరుడిని చంపింది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు పొలిటికల్ వివాదంగా మారింది. ప్రతిపక్షాలు అధికార డీఎంకే, సీఎం ఎంకే స్టాలిన్‌పై విరుచుకుపడుతున్నారు. స్టాలిన్ రాజీనామా…
రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే అధికారం ఎవ్వరికి లేదని... 2021 హుజరాబాద్ ఉప ఎన్నికల్లో నా ఫోన్ టాప్ చేశారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారణకు హాజరయ్యారైన ఆయన సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను ఓడగొట్టాలని ప్రయత్నలు చేశారని.. తాను ఎవ్వరితో మాట్లాడుతున్నానో తెలుసుకున్నారన్నారు.
Bandi Sanjay : కరీంనగర్లో ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ కవచంగా మారిందని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్లు రూపాయి నాణేనికి రెండు ముఖాల్లా ఉన్నాయి. కేసీఆర్ అవినీతిపై స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు…
సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసింది.. దీంతో, తుది నివేదికను సీల్డ్ కవర్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు సీబీఐ అధికారులు.. ఇక, ఈ కేసు విచారణ సందర్భంగా.. సీబీఐ కోర్టులోనూ ఆయేషా మీరా కేసుకు సంబంధించిన నివేదిక కాపీని అందించాలని.. సీబీఐ అధికారులను ఆదేశించింది హైకోర్టు.. మరోవైపు, ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు హైకోర్టు న్యాయమూర్తి..