సందేశ్‌ఖాలీ దర్యాప్తును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టింది.
కర్ణాటకలో కొద్ది రోజుల క్రితం జరిగిన రాష్ర్ట శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న డీకే శివకుమార్‌ది. కర్ణాటక గెలుపులో డీకేతోపాటు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య పాత్ర కూడా ఉంది.
MP YS Avinash Reddy: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతూనే ఉంది.. ఈ రోజు మరోసారి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. ఆయన హైదరాబాద్‌కు రావడంతో.. ఈ రోజు సీబీఐ ముందుకు వస్తారని భావించారు.. ఉదయం 11 గంటలకు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి రావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఆయన డుమ్మా కొట్టారు.. ఈ రోజు విచారణకు రాలేను…
YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ దర్యాప్తులో ఉండగా.. దర్యాప్తు అధికారి రాంసింగ్ ను కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు న్యాయమూర్తి ఎంఆర్ షా.. అయితే, తులశమ్మ కేసులో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీంలో నివేదిక అందజేసింది సీబీఐ.. రాంసింగ్ తో పాటు మరోకరు పేరును సీబీఐ సూచించింది.. కాగా,…
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. దీంతో..నేడు సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
MLAs poaching case: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. గతంలో సీబీఐతో విచారణకు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆర్డర్‌పై తెలంగాణ సర్కార్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ కేసును సీబీఐకు ఇవ్వాలా..? వద్దా..? అనే అంశంపై నేటితో…
స్క్రాప్ డీలర్లు, మిధానీ ఏజీఎం, తెలంగాణ ఎస్ఎస్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మొదలైన వారితో సహా ఏడుగురు నిందితులను CBI అరెస్టు చేసింది. మరియు ఆరు స్థానాల్లో శోధనలు నిర్వహిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హైదరాబాద్ ఆధారిత ప్రైవేట్ కంపెనీకి చెందిన ఇద్దరు స్క్రాప్ డీలర్లతో సహా ఏడుగురు నిందితులను అరెస్టు చేసింది. మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిథాని) AGM, ఒక అసిస్టెంట్ కమాండెంట్, ఒక కానిస్టేబుల్, తెలంగాణ స్టేట్ స్పెషల్…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో నిందితుడు గజ్జల ఉమాశంకర్‌రెడ్డి పాత్రకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. ఉమాశంకర్‌రెడ్డి వివేకా పీఏగా పనిచేసిన జగదీశ్వర్‌రెడ్డి సోదరుడు. ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా… అందులో కీలక విషయాలను వెల్లడించింది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో ఉమాశంకర్‌రెడ్డి రోడ్డుపై పరుగులు తీస్తున్నట్లు వివేకా ఇంటి సమీపంలోని బ్రిడ్జి…
వివేకా హత్య కేసులో కీలక సమాచారం అందించినవారికి సీబీఐ రూ.5 లక్షలు నజరానా ప్రకటించడంపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసులో ఆధారాలిస్తే పారితోషికం ఇస్తామనడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. వివేకాను చంపింది ఎవరో పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీలను అడిగితే చెబుతారని రామకృష్ణ పేర్కొన్నారు. ఏళ్లతరబడి విచారణ చేస్తున్న కేసు పూర్తికాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా అంశాలపై…