‘రోబో 2.0’ సినిమా గుర్తుందా? అందులో ప్రధాన అంశం ఏంటి? మొబైల్స్ లోంచి వచ్చే రేడియేషన్! దాని వల్ల పక్షులకి జరుగుతోన్న తీరని నష్టం! అయితే, అదంతా సినిమా మాత్రమే అనుకుంటే పొరపాటే. రేడియేషన్ వల్ల మానవజాతి, అలాగే, పశువులు, పక్షులు,ఇతర జీవజాతులు, చెట్లు, చేమలు కూడా పూడ్చుకోలేని నష్టాన్ని నెత్తిన మోస్తున్నాయి. ఇప్పటికే చాలా అధ్యయనాలు క్యాన్సర్, హృద్రోగాలు, డయాబిటిస్ వంటివి ఎలక్ట్రో మ్యాగ్నటిక్ పొల్యూషన్ వల్ల పెరుగుతున్నాయని చెబుతున్నాయి. అయినా ప్రపంచ వ్యాప్తంగా టెలికమ్యూనికేషన్…