యూపీఐ లావాదేవీలు జరిపేవారికి గూగుల్ పే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్ పే యాప్ ప్రారంభంలో (అప్పట్లో ‘తేజ్’ యాప్) స్క్రాచ్ కార్డు ఆఫర్ ద్వారా తెగ పాపులర్ అయ్యింది. ఇప్పుడు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా గూగుల్ పే దారినే నమ్ముకుంది. వాట్సాప్ కూడా పేమెంట్స్ కేటగిరిలోకి అడుగుపెట్టడంతో యూజర్లను అట్రాక్ట్ చేయాలని తెగ ప్రయత్నిస్తోంది. దీంతో ఆఫర్లు ప్రకటించాలని నిర్ణయించుకుంది. యూజర్లు వాట్సాప్ పేమెంట్స్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే…