Seven YSRCP MLC Candidates Filed Nomination: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఏడుగురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ నుంచి బీఫారాలు అందుకున్న మర్రి రాజశేఖర్, వివి సూర్యనారాయణ రాజు పెన్మత్స, పోతుల సునీత, కోలా గురువులు, బొమ్మి ఇజ్రాయెల్, జయమంగళ వెంకటరమణ, చంద్రగిరి ఏసురత్నం నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంగా అభ్యర్థులతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి అంబటి రాంబాబు, ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, లావు శ్రీ కృష్ణ దేవరాయలు, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, నంబురి శంకర్ రావు, ఉండవల్లి శ్రీ దేవి, దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తలసిల రఘురామ్, జంగా కృష్ణ మూర్తిలు ఉన్నారు.
MLC Kavitha: అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం
అంతకు ముందు.. సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఏడుగురు అభ్యర్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కలిశారు. సీఎం జగన్ వారికి బీఫారమ్స్ అందించారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్ధులు నామినేషన్ దాఖలు చేశారు. కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్ధానాలకు ఈ నెల 23న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏడుగురు అభ్యర్ధులు బరిలోకి దిగుతున్నారు. అయితే, ఈ స్ధానాలన్నీ వైసీపీ ఏకగ్రీవంగా గెల్చుకునే అవకాశం ఉంది. కాగా, తమకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి ఎమ్మెల్సీ అభ్యర్ధులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మార్చి 14న నామినేషన్ల పరిశీలిన, 16న నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు కూడా గడువు ఉంది. పోటీగా నామినేషన్లేవీ రాకపోతే ఈనెల 23న ఎన్నికలకు బదులుగా ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించే అవకాశం ఉంది.
Bhatti Vikramarkaa: నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టా..!