మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. పాల్ఘర్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం గూడ్స్ రైలుకు చెందిన ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పడంతో గుజరాత్ నుంచి ముంబైకి వచ్చే రైళ్ల రాకపోకలపై ప్రభావం పడిందని రైల్వే ప్రతినిధి తెలిపారు. ఈ ఘటన సాయంత్రం 5.10 గంటలకు జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పశ్చిమ రైల్వే చీఫ్ పీఆర్వో సుమిత్ ఠాకూర్ తెలిపారు.
ఇనుప కాయిల్స్‌తో ఉన్న గూడ్స్ రైలు పన్వేల్‌కు వెళ్తోందని వెల్లడించారు. అప్రమత్తమైన సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. పలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఇక ప్రమాదం తర్వాత పెద్ద ఎత్తున జనాలు గుమిగూడారు. ఇక రైలు రాకపోకలు బంద్ కావడంతో ప్రయాణికులు ఆయా స్టేషన్లలో అవస్థలు పడ్డారు. ఇక ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
The UP line of Mumbai – Surat section has been affected due to derailment of wagons of goods trains at point no 117/118 at Palghar yard at around 17.08 hrs. According to @WesternRly authorities restoration work is in progress. @htTweets pic.twitter.com/c6Vt9ERCUG
— Shashank Rao (@Shashankrao06) May 28, 2024
Derailment at palghar
UP line of Mumbai – Surat section has been affected. Derailment of wagons of a goods trains at Palghar yard at around 17.08 hrs. @WesternRly#palghar #derail #Mumbai pic.twitter.com/LFQXUqKXDh— Abhishek Kumar Pathak (@ImAbhi5200) May 28, 2024
A freight train derailed between Mumbai and Surat section on the Up line of @WesternRly between 5.08 pm. This incident took place in Palghar yard line And disrupted traffic on the Mumbai to Surat Up route. pic.twitter.com/jsCm3XWypm
— Atul B. Kamble (@atulkamble123) May 28, 2024