సీఎం కేసీఆర్ శుక్రవారం (ఇవాళ) చేపట్టాల్సిన రాలేగావ్ సిద్ది (మహారాష్ట్ర) పర్యటన రద్దయినట్లు సమాచారం. ఇదివరకు సీఎంవో ప్రకటించినదాని ప్రకారం.. ముఖ్యమంత్రి మే 26న బెంగళూరు, 27న రాలేగావ్ సిద్ది పర్యటన చేపట్టాల్సి ఉంది. రాలేగావ్ సిద్దిలో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీ కావాల్సి ఉంది. అనంతరం షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని హైదరాబాద్‌కు చేరుకుంటారని సీఎంవో గతంలో వెల్లడించింది. ఈమేరకు సీఎం 26న బెంగళూరుకు వెళ్లి, సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు తిరిగి…
వారాంతాల్లో ఎంఎంటీఎస్ సేవల్లో కోత విధించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు 34 సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది . మొత్తం 16 సర్వీసులు నడుస్తుండగా… అందులో 34 సర్వీసులు అంటే సగం వరకూ సర్వీసులను రద్దు చేసినట్టయ్యింది. ఆయా రైళ్ల రద్దు వివరాలను నగరంలోని అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లలో అందుబాటులో ఉంచుతున్నారు. రద్దైన మార్గాలుః లింగంపల్లి – హైదరాబాద్ మధ్య 18 సర్వీసులు రద్దయ్యాయి. ఫలక్ నుమా…
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో అన్నదాతలు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయాన్ని సోమవారం నాటి కేబినెట్ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా వరంగల్ జిల్లాలో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకుందామని భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన…