గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే కాలుష్య కారకాలను తగ్గించడానికి చర్యలకు నడుం బిగిస్తున్నాయి ఆయా దేశాలు.. ఇప్పటికే కొన్ని దేశాల్లో డీజిల్ వాహనాలపై నిషేధాలు అమలుల్లోకి రాగా.. పెట్రోల్‌తో నడిచే వాహనాలపై కూడా నిషేధాన్ని విధించేందుకు సిద్ధం అవుతున్నాయి కొన్ని దేశాలు.. అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన కాలిఫోర్నియా.. పెట్రోల్ కార్లపై నిషేధాన్ని ప్రకటించింది.. 2035 నుండి మార్కెట్‌లోకి వచ్చే కార్లు జీరో కాలుష్యాన్ని కలిగి ఉండాలని కాలిఫోర్నియా నిర్ణయం తీసుకుంది.. విస్తృతంగా ప్రచారం చేయబడిన ఈ…
కొన్ని ప్రకృతి విపత్తులు అనుకోకుండా విరుచుకుపడతాయి.. అయితే, వాటి గుట్టును విప్పడానికి అనేక ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే తుఫాన్‌లు ఎక్కడ పుడతాయి.. ఎక్కడికి వెళ్తాయి.. ఎక్కడ తీరం దాటతాయి అనేదానిపై నిర్దిష్టమైన అంచనాలు వచ్చేస్తున్నాయి.. ఇక, భూకంపానికి సంబంధిచిన హెచ్చరికలు కూడా ముందే వస్తున్నాయి.. తాజాగా, అమెరికాలోని భూకంపానికి సంబంధించిన హెచ్చరికలు ముందుగానే రాగా.. ఆ తర్వాత కొన్ని క్షణాల్లో భూకంపం వచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియా రాష్ట్రంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది.…
ఈ విశాలమైన విశ్వంలో భూమి ఒక్కటే కాదు… విశ్వంలో అనేక గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, గ్రహశకలాలు ఉన్నాయి. అవి విశ్వంలో ప్రయాణం చేసే సమయంలో ఒక్కోసారి భూమికి దగ్గరగా వచ్చి వెళ్తుంటాయి. ఒక్కోమారు కొన్ని గ్రహశకలాలు భూమిని ఢీకొడుతుంటాయి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆస్టరాయిడ్స్ భూమిని ఢీకొనడం వలన భూమిపై రాక్షసబల్లులు అంతరించిపోయాయి. అయితే, ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నది. అలాంటి ప్రమాదాలు వస్తే వాటిని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే, 2013,…
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని దక్షిణ కాలిఫోర్నియా ఆస్పత్రిలో చేర్పించారు. రక్త సంబంధ ఇన్‌ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం క్లింటన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందంతో పాటు నర్సులు, ఆస్పత్రి సిబ్బంది క్లింటన్‌కు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని అన్నారు. మూడు రోజుల క్రితమే క్లింటన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. రక్తంలో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన తీవ్ర…
ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సంస్థ టెస్లా కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం క్యాలిఫోర్నియాలో ఉన్న టెస్లా కార్ల హెడ్ క్వార్టర్స్‌ను అక్కడి నుంచి 2400 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్సాస్‌కు మార్చాలని నిర్ణయం తీసుకున్నది. టెస్లా సీఈవో తీసుకున్న అనూహ్యమైన నిర్ణయంతో క్యాలిఫోర్నియాలోని అటోమోబైల్ రంగంలో ఒడిదుడుకులు మొదలయ్యాయి. ఎందుకని టెస్లా హెడ్ క్వార్టర్స్ ను మార్చాలి అనుకుంటుంది అనే దానిపై అనేకమైన సందేహాలు కలుగుతున్నాయి. కంపెనీ విస్తరణలో భాగంగానే హెడ్ క్వార్టర్స్‌ను తరలిస్తున్నట్టు ఎలన్…
అమెరికాకు చెందిన ఇద్దరు వైద్యశాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతిని ప్రకటించింది జ్యూరీ. శరీరంపై ఉష్ణగ్రాహకాలు, స్పర్శ అనే అంశంపై ఇద్దరూ శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. నిత్య జీవితంలో శరీరంపై ఉష్ణగ్రాహకాల ప్రభావాన్ని తేలిగ్గా తీసుకుంటామని, కానీ, మానవ నాడీ వ్యవస్థలో ఉష్ణము, స్పర్శ, చలి వంటివి ఎలా ప్రారంభం అవుతాయి, వాటికి నాడులు ఎలా స్పందిస్తాయి అనే వాటిని డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటియన్‌లు సమాధానం కనుగోన్నారని నోబెల్ జ్యూరీ అభిప్రాయపడింది. వీరి పరిశోధనలను గుర్తించిన జ్యూరీ సభ్యులు…
తప్పు చేసి జైలుకు వెళ్లిన ఖైదీల ప్రవర్తన, ఆలోచనా విధానంలో మార్పులు తీసుకొచ్చి వారిని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత జైలు అధికారులపై ఉంటుంది. అయితే, ఓ జైలు అధికారిణి అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఖైదీల ప్రవర్తనలో మార్పులు తీసుకురావడానికి బదులుగా, వారిని రెచ్చగొట్టి శృంగారానికి ప్రేరేపించింది. నచ్చిన ఖైదీలతో నచ్చిన విధంగా శృంగారం చేస్తూ తన కామవాంఛలు తీర్చుకుంది. కాలిఫోర్నియాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో 26 ఏళ్ల మహిళా అధికారిణి టీనా గోంజాలెజ్ కు…
ఇంటికి తాళాలు వేసి ఉన్న ఇళ్లను సాధారణంగా దొంగలు టార్గెట్ చేస్తుంటారు. దొంగతనాలకు పాల్పడుతుంటారు. అయితే, ఓ దొంగమాత్రం ఇంట్లో అందరూ ఉన్నారని తెలిసికూడా దొంగతనం చేసేందుకు ఇంటికి వచ్చాడు. కింద ఇంట్లో అందరూ ఉండగా పైన ఉన్న ఇంట్లోకి దూరిన దొంగ బట్టలు విప్పేసి టవల్ కట్టుకొని స్నానాల గదిలోకి దూరి స్నానం చేయడం మొదలు పెట్టాడు. అయితే, కింద గదిలో అప్పటికే మేల్కొని ఉన్న మహిళ, అలికిడిని గమనించి భర్తను నిద్రలేపింది. భర్త గన్…
ప్రపంచాన్ని కరోనా ఎంతటా ఇబ్బందులకు గురి చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా మాస్క్ ధరించాలి, రెండోది వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అమెరికాలో ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ జరుగుతుండటంతో ఆ దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. కానీ, కరోనాకు భయపడి ఇంకా ప్రజలు మాస్క్ ధరిస్తూనే ఉన్నారు. దీంతో క్యాలిఫోర్నియాకు చెందిన ఫిడిల్ హెడ్ కేఫ్…