కొన్ని ప్రకృతి విపత్తులు అనుకోకుండా విరుచుకుపడతాయి.. అయితే, వాటి గుట్టును విప్పడానికి అనేక ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే తుఫాన్‌లు ఎక్కడ పుడతాయి.. ఎక్కడికి వెళ్తాయి.. ఎక్కడ తీరం దాటతాయి అనేదానిపై నిర్దిష్టమైన అంచనాలు వచ్చేస్తున్నాయి.. ఇక, భూకంపానికి సంబంధిచిన హెచ్చరికలు కూడా ముందే వస్తున్నాయి.. తాజాగా, అమెరికాలోని భూకంపానికి సంబంధించిన హెచ్చరికలు ముందుగానే రాగా.. ఆ తర్వాత కొన్ని క్షణాల్లో భూకంపం వచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియా రాష్ట్రంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 6.2గా నమోదైంది.. అయితే, ఈ భూకంపం రావడానికి కొన్ని సెకండ్ల ముందే ఆ ప్రాంతంలోని దాదాపు 5 లక్షల మంది మొబైల్ ఫోన్లకు భూకంప హెచ్చరికలు చేరాయి.. యూఎస్‌కు చెందిన జియోలాజికల్ సర్వే డెవలప్ చేసిన అలర్ట్ సిస్టమ్ ద్వారా స్థానికులకు ముందే ఈ పెను ప్రమాదం తెలిసిపోగా.. వెంటనే జాగ్రత్త పడినట్టుగా చెబుతున్నారు.
భూప్రకంపనలు రావడానికి కొన్ని క్షణాల ముందుగా ఇది ప్రజలను అలర్ట్ చేస్తోంది.. ప్రమదానికి ముందు మొబైల్ ఫోన్లకు వార్నింగ్ వచ్చేలా యూఎస్ జియోలాజికల్ సర్వే ఓ యాప్‌ను అభివృద్ధి చేయగా.. షేక్అలర్ట్ అనే వార్నింగ్ వ్యవస్థతో పెను ప్రమాదం తప్పినట్టుగా చెబుతున్నారు.. భూమి తీవ్రంగా కంపిచడానికి 10 సెకన్ల ముందు తమకు వార్నింగ్ వచ్చిందని ఆ యాప్ వాడిని వినియోగదారులు చెబుతున్నారు. కాగా, ఈ షేక్అలర్ట్ వార్నింగ్ సిస్టమ్‌తో మైషేక్‌యాప్‌కు సంకేతాలు అందుతాయి.. పబ్లిక్ వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్స్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు కూడా భూకంప సంకేతాలు వెళ్లడం జరుగుతుంది. యూఎస్జీఎస్ సెన్సార్ల ద్వారా వచ్చిన సమాచారం క్షణాల వ్యవధిలోనే మొబైల్ ఫోన్లలో ఉన్న అలర్ట్ యాప్‌లకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఇక, భూకంపానికి సంబంధించిన అలర్ట్ రావడంతో ప్రజలు ముందే అప్రమత్తం అయ్యే అవకాశాలు ఉండడంతో పాటు.. ప్రాణ నష్టం భారీగా తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.