ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సంస్థ టెస్లా కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం క్యాలిఫోర్నియాలో ఉన్న టెస్లా కార్ల హెడ్ క్వార్టర్స్‌ను అక్కడి నుంచి 2400 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్సాస్‌కు మార్చాలని నిర్ణయం తీసుకున్నది. టెస్లా సీఈవో తీసుకున్న అనూహ్యమైన నిర్ణయంతో క్యాలిఫోర్నియాలోని అటోమోబైల్ రంగంలో ఒడిదుడుకులు మొదలయ్యాయి. ఎందుకని టెస్లా హెడ్ క్వార్టర్స్ ను మార్చాలి అనుకుంటుంది అనే దానిపై అనేకమైన సందేహాలు కలుగుతున్నాయి. కంపెనీ విస్తరణలో భాగంగానే హెడ్ క్వార్టర్స్‌ను తరలిస్తున్నట్టు ఎలన్ మస్క్ ప్రకటించారు. అయితే, క్యాలిఫోర్నియాలో ఉన్న చట్టాల వలన టెస్లా ఇబ్బందులు పడుతుందని, ఇన్‌కమ్ ట్యాక్స్, తక్కువ రెగ్యులేషన్ ఉన్న ప్రాంతాలకు తరిలి వెళ్లేందుకు టెస్లా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనికోసమే క్యాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు తరలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
Read: విజయశాంతితో పాటు కుష్బూకు బీజేపీలో కీలక పదవులు…