అమెరికాలోని కాలిఫోర్నియాలో సూట్‌కేస్‌లో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సరస్సులో చెత్తను తొలగిస్తుండగా పారిశుద్ధ కార్మికులకు కంటపడింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. మంగళవారం ఉదయం ఓక్లాండ్‌లోని సరస్సును శుభ్రం చేస్తుండగా పారిశుద్ధ్య కార్మికులకు నీటిపై తేలుతూ సూట్‌కేస్ కనిపించింది.
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం మరోసారి వచ్చింది. ఇవాళ ( శుక్రవారం ) తెల్లవారుజామున 2.56 గంటలకు పోర్ట్ బ్లేయిర్ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత రికార్ట్ స్కేలుపై 4.3 గా నమోదు అయిందని సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
అనసూయ భరద్వాజ్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్ గా కెరీర్ ను మొదలు పెట్టి స్టార్ యాక్టర్ గా ఎదిగింది ఈ భామ. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది. అయితే వరుస సినిమా షూటింగ్ ల నుంచి బ్రేక్ తీసుకోని ఫ్యామిలీ తో సరదాగా ట్రిప్ వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం కాలిఫోర్నియా వీధుల్లో విహరిస్తున్న ఈ భామ తన హాట్ అందాలతో రెచ్చగొడుతుంది..…
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఓ జెట్ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మణంపాలయ్యారు. శనివారం తెల్లవారుజామున ఫ్రెచ్‌వ్యాలీ విమానశ్రయం సమీపంలో సెస్నా బిజినెస్ జెట్ విమానం కూలిపోయింది.
పాముతో ఆటలాడితే అవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. చిర్రెత్తుకొచ్చిందా? ఒక్క దెబ్బకి కాటేస్తాయి. ఓ వ్యక్తి కొండచిలువ గుడ్లు తీయబోయాడు. అతనితో కొండచిలువ చేసిన ఫైట్ చూస్తే వణుకు పుడుతుంది. అయితే ఆయన దాని దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు.
కాలిఫోర్నియాలో జరిగిన ప్రైడ్ ఇన్ లాంగ్ బీచ్ 2023 ఈవెంట్‌లో అమెరికాకు చెందిన స్పీడ్ క్యూబింగ్ లెజెండ్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ హాల్ ఆఫ్ ఫేమర్, మాక్స్ పార్క్ అనే 21 ఏళ్ల యువకుడు 3x3x3 రూబిక్స్ క్యూబ్‌ను అత్యంత వేగంగా పరిష్కరించిన రికార్డును బద్దలు కొట్టారు.
యూట్యూబర్ గా పని చేస్తున్న బ్రెంట్ రివెరా అనే 25 ఏళ్ల యువకుడు.. తన కుక్క చార్లీ కోసం లగ్జరీ హౌస్ ను నిర్మించాడు. అది కూడా స్పెషల్ గా ఉండాలని దారి మొదటి పుట్టినరోజు కానుకగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. అతను యూట్యూబర్ కావడంతో.. దీన్నంతా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అమెరికాలో ఓ చారిత్రక పరిణామం చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలో కుల వివక్షను నిషేదించాలని కోరుతూ రాష్ట్ర సెనేట్ జ్యుడిషియల్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదంచింది. దీన్ని భారతీయ-అమెరికన్ వ్యాపార, ఆలయ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కుల వివక్ష వ్యతిరేక బిల్లును సెనేట్ కు పంపేందుకు కాలిఫోర్నియా సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వేసిన పరువునష్టం కేసులో పోర్న్ స్టార్ డేనియల్స్‌కు చుక్కెదురయ్యింది. కోర్టు ఫీజు భాగంగా ట్రంప్ తరఫు న్యాయవాదులకు లక్షా 20వేల డాలర్లు చెల్లించాలని కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది.