American Airlines: విమానం గాల్లో ఉండగా ఫ్లైట్ అటెండెంట్ పై దాడి.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attack on flight attendant: విమానం గాల్లో ఉండగా ఓ వ్యక్తి ఫ్లైట్ అటెండెట్ పై విచక్షణారహితంగా దాడిచేశాడు. తనను ఫస్ట్ క్లాస్ బాత్రూమ్ వాడుకోవడానికి నిరాకరించాడనే కారణంతో వీపు, ముఖం మీద పిడిగుద్దులు కురిపించాడు. విమానం లాస్ ఏంజెలెస్‌లో ల్యాండ్ కాగానే 33 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను మళ్లీ విమానం ఎక్కకుండా జీవితకాల నిషేధం విధించారు. విచారణ తర్వాత అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. మెక్సికో నుంచి లాస్ ఏంజెలెస్ వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది.
విమానం గాల్లో ఉండగా ఫ్లైట్ అటెండెంట్ పై నిందితుడు దాడి చేసి పిడిగుద్దులు కురిపిస్తుండగా తోటి ప్రయాణికుడు బారీ లివింగ్ స్టోన్ ఈ ఘటనను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మీడియాలోఫ్లైట్ అటెండెంట్ సీట్ల మధ్య నిలబడి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? అంటూ.. తిరిగి విమానం ముందు వైపు వెళ్తున్నాడు. ఈనేపథ్యంలో.. వెనక నుంచి వచ్చిన నిందితుడు అటెండెంట్ పై దాడిచేసాడు. వీపు, ముఖం మీద పిడిగుద్దులు కురిపించాడు. ఆతరువాత తన సీటు వద్దకు వెళ్లిపోయాడు. అయితే.. విమానం ల్యాండయ్యాక లాస్ ఏంజెలెస్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అతడిని విమానం నుంచి కిందికి దింపి అదుపులో తీసుకున్నారు. ఈవీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read
- Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటన
ఫ్లైట్ అటెండెంట్‌పై భౌతిక దాడికి దిగిన నిందితుడు విమానం ఎక్కకుండా జీవితకాల నిషేధం విధిస్తున్నట్టు అమెరికన్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. కాగా.. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో 24వేల మందికి పైగా ఫ్లైట్ అటెండెంట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ ఫ్లైట్ అటెండెంట్స్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించింది. అయితే.. ఇది చాలా ప్రమాదకరమైనదని.. ప్రాణాపాయకరమైనదని ఆందోళన వ్యక్తం చేసింది. కాలిఫోర్నియా లోని వెస్ట్‌మాస్టర్ కు చెందిన నిందితుడు అలెగ్జాండర్ టంగ్ క్యూలె దోషిగా తేలితే 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ప్రకటించింది.
Violence in the air: a friend was travelling from Cabo to LAX, when a passenger hit a flight attendant for not letting use him the first class bathroom. He was later restrained by other passengers and arrested upon touchdown. The video shot was by Barrie Livingstone pic.twitter.com/PntVqWyWs9
— Saad Mohseni (@saadmohseni) September 22, 2022
తాజావార్తలు
-
Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
-
Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
-
Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!