IAS officer's wife's rape: ఐఏఎస్ అధికారి భార్యపై అత్యాచారంలో కేసులో పోలీసులు తీరుపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ఐఏఎస్ అధికారి భార్యపై జరిగిన ఈ ఘటనపై ప్రాథమిక విచారణ తప్పుగా నిర్వహించినందుకు ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారికి కేసుని బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
Sandip Ghosh: పశ్చిమ బెంగాల్ లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను సీబీఐ అధికారులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో ఈ చర్య తీసుకున్నారు.
Supreme Court: లైంగిక వేధింపుల కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కొట్టేసింది. గతేడాది ఈ కేసులో యుక్తవయసులోని బాలికను ‘లైంగిక ప్రేరేపణలను నియంత్రించుకోవాలి’’ అని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
Women Harassment: కోల్‌కతాలో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన యావద్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధితురాలికి న్యాయం కోసం మహిళలు, తోటి వైద్యులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ కేసుల అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం నిందితులను కాపాడుతుందా..?
Kolkata Doctor Case: ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రి పునరుద్ధరణ పనులపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్యాచారం జరిగిన సెమినార్ హాల్ సమీపంలోని భాగాలను పునరుద్ధరించాల్సిన అత్యవసరం ఏమిటి..? అని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
Sandeshkhali Case: పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బెంగాల్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
ఆధార్ కార్డు పౌరసత్వానికి ఆధారం కాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడీఏఐ) కలకత్తా హైకోర్టుకు తెలిపింది. చట్టబద్ధంగా దేశంలోకి ప్రవేశించిన నాన్ రెసిడెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చని.. ఆధార్ పొందవచ్చని యుఐడీఏఐ (UIDAI) పేర్కొంది.
High Court : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు (transgender persons) ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాల్లో సమానమైన విధానాన్ని అవలంబిస్తున్నదని పేర్కొన్న కోర్టు, అయితే వారికి ఇంకా రిజర్వేషన్లు కల్పించలేదని పేర్కొంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని జస్టిస్ రాజశేఖర్ మంథా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. టీచర్స్ ఎలిజిబిలిటీ…
PM Modi: హర్యానాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జీవించి ఉన్నంత వరకు దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరని అన్నారు.