నార్కోటిక్ కట్టడిపై సబ్ కమిటీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. గంజాయి విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని హెచ్చరించారు.. గంజాయి, డ్రగ్స్ పై ఇక యుద్ధమే అని ప్రకటించిన మంత్రి లోకేష్.. నిర్మూలనకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉక్కుపాదం మోపుతాం అన్నారు.. నార్కోటిక్స్ నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.. ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఇకపై ఈగల్ గా…
Cabinet Sub Committee : అమరావతిలో భూ కేటాయింపులపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో, రాజధానిలోని పలు సంస్థలకు భూమి కేటాయింపులు చేసే అంశంపై మంత్రుల కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ లో మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్, టీజీ భరత్ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కమిటీ, గతంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించనుంది.…
Cabinet Meeting: నేడు (బుధవారం) తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ లో మధ్యాహ్నం 1 గంటకు ధాన్యం కొనుగోలు పై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు. సమావేశంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మంత్రులు అధికారులతో మంతనాలు జరగనున్నాయి. అలాగే నేటి సాయంత్రం 3 గంటలకు ఎర్రమంజిల్ లోని జలసౌదలో నల్లగొండ జిల్లా నీటిపారుదల శాఖా సమీక్ష సమావేశం జరగనుంది. ఈ…
ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం కానుంది. కొత్త మద్యం విధానంపై కీలక విషయాలను మంత్రివర్గ ఉపసంఘం మీడియా సమావేశంలో వెల్లడించింది. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు కొల్లురవీంద్ర, నాదెండ్ల మనోహర్ , సత్య ప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్‌లు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. 6 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిశీలించామని వారు తెలిపారు.
SC Classification: ఈ రోజు జలసౌదాలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రెండు కేబినెట్ సబ్ కమిటీల సమావేశాలు జరగనున్నాయి. మంత్రి ఉత్తమ్ చైర్మన్ గా ఉన్న రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీల సమావేశాలు జరగబోతున్నాయి.
ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సంస్థలకు జరపాల్సిన భూ కేటాయింపుల పరిశీలనకు కేబినెట్ సబ్ కమిటీని సర్కారు ఏర్పాటు చేసింది.
వరద నష్టంపై తొలిసారి భేటీకానుంది కేబినెట్ సబ్ కమిటీ... ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు భేటీకానున్నారు మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, అనగాని ప్రసాద్, వంగలపూడి అనిత. ఇప్పటి వరకు జరిగిన వరద నష్టం అంచనాలపై సమీక్ష నిర్వహించనున్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం, ఇళ్ల నష్టం అంచనాలపై చర్చించనుంది కేబినెట్ సబ్ కమిటీ..
మద్యం పాలసీ రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ తొలిసారిగా సమావేశమైంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే.
ఏపీలో మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్‌లు ఉండనున్నారు.