ఏపీ సచివాలయం రెండవ బ్లాక్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండో బ్లాక్ లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారం ఇచ్చింది. ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెంటనే సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగిందా? కుట్ర కోణం ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ జరుగుతోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. 2027లోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పంజాబ్‌లోనే ఆప్ ప్రభుత్వం ఉంది.
MLA Anirudh Reddy : తెలంగాణలో ఇటీవల, ఒక ముఖ్యమైన రాజకీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు నాయకులు , మీడియా ద్వారా ప్రచారం చేయబడిన రహస్య భేటీ వివాదంపై, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సోమవారం స్పందించారు. కొన్ని రోజుల క్రితం, ఈ ఎమ్మెల్యే పది మంది ఎమ్మెల్యేలతో కలిసి రహస్య భేటీ నిర్వహించారని, ఆ భేటీలో వారు ఒక మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే, గురువారం జరిగిన…
CM Rvanth Reddy : తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వాతావరణంలో కేబినెట్ విస్తరణ గురించి తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసిన తర్వాత, ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో బిజీగా ఉండడంతో కేబినెట్ విస్తరణ అంశం కొంతకాలం వెనక్కి పోయింది. అయితే, ఈ సమయంలో ఎవరైనా కేబినెట్ విస్తరణలో చోటు పొందేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ, ఈ విషయంపై ఇటీవల తాజా పర్యవేక్షణలు జోరుగా సాగుతున్నాయి.…
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
PM Modi: అయోధ్యలో భవ్య రామమందిరంలో రామ్ లల్లా కొలువుదీరారు. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా సోమవారం రోజున ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. లక్షలాది మంది రామ భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆలయ ట్రస్టు ఆహ్వానాలు అందించడంతో వారంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి నెలలో కేంద్ర మంత్రులు ఎవరూ కూడా అయోధ్య రామ మందిర దర్శనానికి వెళ్లొద్దని ప్రధాని నరేంద్రమోడీ కోరినట్లు సమాచారం.
ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీలో జగన్ పాలన ఆటవిక పాలనగా మారుతుంది. కోర్టులో కేసులో ఉన్న పత్రాలు దొంగిలించడం అరాచక పాలనకు పరాకాష్ఠ. పోలీసు కట్టుకధలు మరింత విస్మయానికి గురి చేస్తున్నాయన్నారు ఏపీసీసీ చీఫ్ సాకె శైలజనాథ్. ఎక్కడో బీహార్లో విన్న కధలు.. ఏపీలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. దళిత బిడ్డలను చంపినా, కొట్టినా పట్టించుకోలేదు. నిన్న ఎస్పీ అంత అర్జంటుగా మీడియా సమావేశం పెట్టడం ఎందుకు..?వాళ్లు చెప్పిన అంశాలు నమ్మే విధంగా ఉన్నాయా..?ఎవరిచ్చారో…
ఏపీలో వివిధ శాఖలకు కొత్త మంత్రులు వచ్చారు. రాష్ట్రంలో కీలకంగా భావించే ఇరిగేషన్ శాఖకు పార్టీ సీనియర్ నేత, అధికారప్రతినిధి అంబటి రాంబాబు మంత్రిగా వచ్చారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన పదవిని ముఖ్యమంత్రి నాకు అప్పగించారు. సమర్ధవంతంగా నా బాధ్యతను పూర్తి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయిన పోలవరం విషయంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తా. రాయలసీమ సాగు నీటి…