బద్వేల్ నియోజక వర్గానికి ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు బరిలో ఉంటాయని అనుకున్నారు. వైసీపీ ఇప్పటికే అభ్యర్ధిని ప్రకటించింది. జనసేన, టీడీపీలు కూడా పోటీలో ఉంటాయని అనుకున్నారు. కానీ, సంప్రదాయాలను గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు మొదట జనసేన పార్టీ ప్రకటించింది. ఇదే బాటలో టీడీపీ కూడా నిర్ణయం తీసుకుంది. టీడీపీ నుంచి మొదట డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ పోటీ చేస్తారని అనుకున్నారు. కాని, జనసేన నిర్ణయం…
బద్వేల్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనెల 30 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు ప్రచారం చేసేందుకు సిద్దమవుతున్న తరుణంలో అట్లూరు మండలంలోని చిన్నమరాజుపల్లె గ్రామస్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించలేదని, తాము బద్వేల్ ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నామని గ్రామ పొలిమేర్లలో బ్యానర్‌ను కట్టారు. ఏ నాయకుడు తమ గ్రామంలోకి రావొద్దని, గ్రామానికి రోడ్డు…
భవానీపూర్ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. సెప్టెంబర్ 30 వ తేదీన భవానీపూర్‌కు ఎన్నికలు జరగ్గా ఈ రోజు ఓట్ల లెక్కింపు జరిగింది. మొదటి రౌండ్ నుంచే మమతా బెనర్జీ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ బీజేపీ నేత ప్రియాంక టిబ్రేవాల్‌పై 58,389 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మమతా విజయంతో పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ సంబరాలు అంబరాన్ని తాకాయి. Read: దుబాయ్…
సెప్టెంబర్ 30 వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేశారు. బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటిగ్ జరుగుతున్నది. తాజా సమాచారం ప్రకారం తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 12 రౌండ్లు ముగిసే సరికి మమతా బెనర్జీ 35 వేల ఓట్ల మేజారిటీని…
టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీతో పాటుగా ఎమ్మెల్యేపదవికి కూడా రాజీనామా చేయడంతో హుజురాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా బీజేపీ కూడా తమ అభ్యర్ధిని ప్రకటించింది. హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నట్టు బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించడంతో ఆ నియోజక వర్గంలో త్రిముఖపోటీ జరగనుంది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ పోటీ…
హుజురాబాద్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక ఈనెల 30 వ తేదీన జరగబోతున్నది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించాయి. టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ బరిలో ఉంటే, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ధిపై అనేక చర్చలు జరిగాయి. మొదట కాంగ్రెస్ అభ్యర్ధిగా కొండ సురేఖను అనుకున్నా, ఆమె తిరస్కరించడంతో తెరపైకి అనేక పేర్లు వచ్చాయి.…
భవానీపూర్ ఉప ఎన్నిక ముగిసింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ తరపున ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి ప్రియాంక బరిలో ఉన్నారు. అయితే, ఇది ముఖ్యమంత్రి సిట్టింగ్ స్థానం కావడంతో అమె విజయం నల్లేరుపై నడకే అయినప్పటికీ, బీజేపీ గట్టి పోటి ఇవ్వనుందని సర్వేలు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక జరిగే సమయంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు మధ్య జరిగిన…
బద్వేల్ ఉప ఎన్నికలు అక్టోబర్ 30 వ తేదీన జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో విజయం తమదే అని టీడీపీ ధీమాను వ్యక్తం చేసింది. దివంగత మాజీ మంత్రి వీరారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంతో అభివృద్ది చేశారని టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ పేర్కొన్నారు. సీఎం జగన్ బద్వేల్ అభివృద్ధికి ఇచ్చిన హామీలు…
కడప జిల్లాలోని బద్వేల్‌కు ఉప ఎన్నికను అక్టోబర్ 30 వ తేదీన నిర్వహించబోతున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. కాగా, రేపు ఈ ఉప ఎన్నికకు సంబంధించిన గెజిట్‌ను విడుదల చేయబోతున్నారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 30 వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి…
తెలుగు రాష్ట్రాల్లో మరికాసేపట్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుండగా, తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉపఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచారం నిర్వహించాయి. అన్ని పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి నియోజక వర్గంలో త్రిముఖ పోటీ నెలకొన్నది. అధికార వైసీపీ సిట్టింగ్ స్థానం కావడంతో గెలుపుపై ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నది. అదే విధంగా తప్పకుండా తామే గెలుస్తామని…