హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి మరో వారం రోజులే మిగిలాయి. దాంతో క్యాంపెయిన్ తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్స్ ఒక్కొక్కరుగా రంగంలో దిగుతున్నారు. అధికార పార్టీ నెల క్రితమే మంత్రి హరీష్ రావును రంగంలో దించింది. మరో రెండు ప్రధాన పార్టీలు తమ ముఖ్య నేతలను ప్రచారంలోకి దించాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కేసీఆర్‌కు ప్రతిష్టకు సవాలుగా మారింది. గెల్లును గెలిపించే బాధ్యతను మంత్రి హరీష్ రావు…
బద్వేల్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 30 వ తేదీన బద్వేల్ ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ, బీజేపీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఈ ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీతో ఉన్న పొత్తులో భాగంగా జనసేన పార్టీ పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ గత సంప్రదాయాలను గౌరవిస్తూ జనసేప పోటీ నుంచి తప్పుకున్నది. అటు తెలుగుదేశం పార్టీ కూడా ఉప…
ఈనెల 30 వ తేదీన జగరబోతున్న హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం పెద్ద ఎత్తున బందోస్తును ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల కంటే ఈ ఉప ఎన్నిక కోసం ఏర్పాటు చేస్తున్న బందోబస్తు మరింత ఎక్కువగా ఉన్నది. 1900 మంది బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్లూకోట్స్, పెట్రో కారులతో పెట్రోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘాను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. హుజురాబాద్ పరిధిలోని…
హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనున్నది. ఈరోజు సాయంత్రం గుర్తులను కేటాయించనున్నారు. ప్రస్తుతానికి బరిలో 42 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో ఎంతమంది నామినేషన్లను ఉపసంహరించుకుంటారు అన్నది తెలియాల్సి ఉన్నది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణకు సమయం ఉన్నది. పోటీనుంచి తప్పుకునే వారు నేరుగా సంతకం పెట్టి నామినేషన్‌ను వెనక్కి తీసుకోవాలి. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, 32 మంది…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తైంది. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక కోసం మొత్తం 27 నామినేషన్లు దాఖలవ్వగా అందులో 9 నామినేషన్లను తిరస్కరించారు. దీంతో బద్వేల్‌లో 18 మంది బరిలో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇటు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం 61 నామినేషన్లు దాఖలవ్వగా, ఇందులో 19 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు నిలిచారు.…
బద్వేలు ఉప ఎన్నిక ప్రచారం జోరు అందుకున్నది. నిన్నటితో నామినేషన్ల పర్వం ముగియడంతో పోటీలో ఉన్న పార్టీలు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన పోటీ చేయాల్సి ఉన్నా, గత సంప్రదాయాలను గౌరవిస్తూ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నది. అయితే, జనసేన తప్పుకోవడంతో బీజేపీ పోటీకి సిద్ధమైంది. బద్వేల్ ఉప ఎన్నికలో జనసేన పార్టీ బీజేపీకి ప్రచారం చేస్తుందా లేదా అనే అంశంపై నిన్నటి వరకు సందేహం ఉన్నది. జనసేన పార్టీ నేత నాదెండ్ల…
హుజురాబాద్ ఉప ఎన్నిక వేడి పెరిగింది. నామినేషన్ల పర్వం ముగియడంతో క్యాంపెయిన్లు మొదలయ్యాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీలు హుజురాబాద్‌లో ప్రచారం మొదలుపెట్టగా, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ 20 మందితో కూడిన క్యాంపెనర్ల జాబితాను రిలీజ్ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా, మధుయాష్కీ తదితరులు ఈ…
బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా అభ్యర్థిని కూడా ప్రకటించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రైల్వే కోడూరులో నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా, ఇప్పుడు బద్వేల్ ఉప ఎన్నికల్లో మరోసారి సురేష్‌ను ఉప ఎన్నికల్లో అభ్యర్ధిగా బీజేపీ ఎంపికచేసింది. గత సంప్రదాయాలను గౌరవిస్తూ జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా ఎన్నికల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉన్నది. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ…
కడప జిల్లాలోని బద్వేలు నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించారు. అయితే, గత సంప్రదాయాలను గౌరవిస్తూ జనసేన, టీడీపీలు ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నాయి. కానీ, బీజేపీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపింది. రాజకీయాలను రాజకీయాల మాదిరిగానే చూస్తామని చెప్పిన బీజేపీ, బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపికపై కడప జిల్లా నేతలతో చర్చలు ఏపీ బీజేపీ చర్చలు నిర్వహించారు.…
బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి ఎవరు అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. ఈరోజు లేదా రేపటిలోగా ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. ఇక ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు రావాలని పవన్‌ను కోరతామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. భవిష్యత్తులో బీజేపీ, జనసేన పార్టీల పొత్తు కొనసాగుతుందని అన్నారు. పవన్‌పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. విమర్శలు చేసేటప్పుడు…