తిరుపతి, సాగర్ ఎన్నికలకు సర్వం సిద్ధం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google

తెలుగు రాష్ట్రాల్లో మరికాసేపట్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుండగా, తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉపఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచారం నిర్వహించాయి. అన్ని పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి నియోజక వర్గంలో త్రిముఖ పోటీ నెలకొన్నది. అధికార వైసీపీ సిట్టింగ్ స్థానం కావడంతో గెలుపుపై ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నది. అదే విధంగా తప్పకుండా తామే గెలుస్తామని టీడీపీ చెప్తుండగా, తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని, తద్వారా కేంద్రం నుంచి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని బీజేపీ చెప్తున్నది. ఇక సాగర్ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ తమదే విజయం అని చెప్తుండగా, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అదే విధంగా బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతున్నది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మే 2 వ తేదీన ఫలితాలు వెలువడతాయి.
Also Read
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!