హుజురాబాద్ ఉప ఎన్నికకు సిద్దం అవుతుంది టీఆర్ఎస్. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో తెరాస నేతల సమావేశం అయ్యారు. నియోజక వర్గానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల నియామకం పై చర్చించారు. సమావేశానికి ఇంచార్జీ లు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత్ రావు, ఎమ్మెల్యే లు పెద్ది సుదర్శన్ , అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, సతీష్ బాబు, ఎమ్మెల్సీ లు పల్లా , బస్వరాజు సారయ్య, నార దాసు హాజరయ్యారు. ఈ నెల 10న నియోజక వర్గ స్థాయి సమావేశం జరగనుంది. ఈ 10న జరిగే సమావేశానికి మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు.