హైదరాబాద్ లో ఐటీ శాఖ అధికారుల దాడులు కలకలం రేపాయి. బంగారం హోల్‌సేల్ వ్యాపారం చేసే బిజినెస్‌మెన్‌లే టార్గెట్‌గా ఐటి దాడులు నిర్వహించారు. ఇవాళ ఉదయమే నగరంలోని పలు ప్రాంతాలలో బంగారు వ్యాపారాల ఇండ్లపై దాడులు చేశారు ఐటి శాఖ అధికారులు.. బంగారం హోల్‌సేల్ లావాదేవీలపై ఆరాతీశారు. కొనుగోలు అమ్మకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బంగారం వ్యాపారంపై దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ డీటెయిల్స్ తీసుకున్నారు. గత ఐదేళ్లుగా దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ పై పలు…
బీహార్‌లో ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన వికాస్ అకా రాజా హతమయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాజా చనిపోయాడు.
ఆపరేషన్ సిందూర్, అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ గుర్తుచేసుకున్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌కు శాంతి విలువ ఏంటో తెలుసు అని పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఘరానా మోసానికి తెరలేపాడు ఓ కేటుగాడు. పోలీసునని చెప్పి డబ్బులు అవసరమని తనకు ఫోన్ పే చేస్తే కానిస్టేబుల్ ద్వారా క్యాష్ పంపిస్తానని వ్యాపారులను నమ్మబలికి బురిడీ కొట్టించాలనుకున్నాడు. అయితే వ్యాపారస్తులు చాకచక్యంగా ప్రవర్తించడంతో కేటుగాడి వలకు చిక్కలేదు.
Mukhesh Ambani : ముంబైలోని అంధేరిలో మహిళా ఆయుర్వేద వైద్యురాలిని రూ.7 లక్షలు మోసం చేసిన ఉదంతం వెలుగు చూసింది. ఈ మోసం చేయడానికి డీప్‌ఫేక్ వీడియోలను ఉపయోగించారు.
Raj Kundra : ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు సంబంధించిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది. పీఎంఎల్‌ఏ చట్టం 2002 కింద రూ.97.79 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది.
80 lakh Car Burnt: అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించడం లేదన్న అక్కసుతో రూ.80లక్షల విలువైన స్పోర్ట్స్ కారును తగులపెట్టిన ఘటన పహాడిషరీఫ్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహిళా ఇన్‌స్పెక్టర్‌తో ఓ బడా వ్యాపారవేత్త వాగ్వాదానికి పాల్పడ్డ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి పోలీసులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాగా.. మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్, వ్యాపారవేత్త మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు అతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
Theft : జైపూర్‌లో శుక్రవారం ఓ వ్యాపారి నుంచి దుండగులు రూ.33 లక్షలు దోచుకున్నారు. ఇద్దరు అగంతకులు ఆ వ్యాపారి కళ్లలో కారం కొట్టి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కారులో కూర్చున్న వ్యాపారి చేతిలోని బ్యాగ్‌ని ఈ దుండగులు లాక్కొని పారిపోయారు.