Bihar: బీజేపీ నేత ఖేమ్కా హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడు ఎన్‌కౌంటర్
- బీజేపీ నేత ఖేమ్కా హత్య కేసులో కీలక పరిణామం
- నిందితుడు రాజా ఎన్‌కౌంటర్
- హత్య వెనుక రాజకీయ నేత ప్రమేయం ఉన్నట్లుగా అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన వికాస్ అలియాస్ రాజా హతమయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాజా చనిపోయాడు. సంఘటనాస్థలి నుంచి తుపాకీ, బుల్లెట్, కార్ట్రిడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని పాట్నాలోని నలంద మెడికల్ కాలేజీకి తరలించినట్లు బీహార్ పోలీసులు అధికారిక ప్రకటనలో తెలిపారు.
ఇది కూాడా చదవండి: HHMV : హరిహర వీరమల్లు మూవీ పై ముదురుతున్న వివాదం..
Also Read
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
ఖేమ్కా హత్యకు సంబంధించి పాట్నా పోలీసులు డజనుకు పైగా అనుమానితులను అరెస్ట్ చేశారు. ఇక ఖేమ్కా అంత్యక్రియలకు పాట్నాలోని పున్‌పున్ నివాసి రోషన్ కుమార్ హాజరయ్యాడు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య మిస్టరీ వీడించింది. అయితే ఈ హత్యలో రాజా ప్రధాన సూత్రధారిగా అనుమానించారు. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు రాజాను ఎన్‌కౌంటర్ చేశారు.
ఇది కూాడా చదవండి: Harrier EV vs Creta EV: హారియర్ లేదా క్రెటా..? ఏ ఎలక్ట్రిక్ మోడల్ బెస్ట్.. ఎందుకు..?
ఇక ప్రధాన నిందితుడు ఉమేష్‌ను సోమవారం పాట్నాలో అరెస్టు చేసినట్లు వర్గాలు తెలిపాయి. అయితే ఈ హత్య వెనుక ఒక రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ దిశగా కూడా పోలీసులు విచారిస్తున్నారు.
జూలై 4న రాత్రి 11:40 గంటల సమయంలో ఖేమ్కా ఇంటికి చేరుకోగానే సమీపంలో నక్కిన దుండగులు తుపాకీ తీసుకుని కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడికక్కడే ఖేమ్కా చనిపోయారు. మూడేళ్ల క్రితం కుమారుడు కూడా హత్యకు గురయ్యాడు. అయితే రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ముందు హత్య జరగడంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నితీశ్‌కుమార్ పాలనలో బీహార్ నేర రాజధానిగా మారిందని రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యాపారవేత్తలకు, ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని.. హత్యలు, దోపిడీలు సర్వసాధారణంగా మారాయని ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!