ఆపిల్ ఐప్యాడ్ రూ. 20 వేలకు పొందుతారని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. Apple ఐప్యాడ్ 9వ మోడల్.. అసలు ధర ఈ-కామర్స్ సైట్‌లో దాదాపు రూ. 30,990 నుండి రూ. 33,990 ఉంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డే సేల్‌లో ఆపిల్ ఐప్యాడ్‌ను కేవలం రూ. 20,000కే కొనుగోలు చేయవచ్చు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డులో ముకేశ్ అంబానీ ముగ్గురు వారసులను నియమించిన సంగతి తెలిసిందే. బోర్డులో చేరిన వారికి ఎలాంటి జీతమూ ఉండదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్లుగా ఉన్న బిలియనీర్ ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలకు బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు రుసుము మాత్రమే చెల్లించబడుతుందని కంపెనీ తన బోర్డులో వారి నియామకానికి వాటాదారుల అనుమతిని కోరుతూ ఒక తీర్మానంలో పేర్కొంది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కారు భద్రతపై తప్పుడు హామీల కోసం ఆనంద్ మహీంద్రాతో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌కు చెందిన 12 మంది ఉద్యోగులపై చీటింగ్ కేసు నమోదైంది.
Internet Disk: స్మార్ట్ ఫోన్ అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తుంది. అందుకే ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అని తేడాలేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా గడపలేకున్నారు. అయితే ఎక్కువ మంది ఉపయోంచే యాండ్రాయిడ్ ఫోనుల్లో వివో కూడా ఒకటి. ఈ వివో ఫోన్ తయారీ సంస్థ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వివో వై56 ను విడుదల చేసిన విషయం అందరికి సుపరిచితమే. అయితే సోమవారం వివో వై56 మోడల్…
Tesla: భారతదేశం ఆటోమొబైల్స్ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. దీంతో పాటు ఈవీ వాహనరంగం కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ, ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా బలహీనమైన డిమాండ్, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు తగ్గిన కారణంగా భారత్‌లో డీజిల్ అమ్మకాలు సెప్టెంబరులో క్షీణించాయి . ఈమేరకు ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల ప్రాథమిక డేటా వెల్లడించింది.
Youtube: టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రమ్ రీల్స్‌కు పోటీగా యూట్యూబ్ తీసుకువచ్చిన షార్ట్ వీడియోస్ ‘యూట్యూబ్ షార్ట్స్’ అనతి కాలంలోనే చాలా ఆదరణ పొందాయి. అయితే ఇది యూట్యూబ్ వ్యాపారాన్నే దెబ్బతీసేలా తయారైంది. కోట్లాది రూపాయల వ్యాపారాని ఈ షార్ట్స్ గండికొడుతున్నాయిని
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాల మధ్య, వారంలో మొదటి ట్రేడింగ్ రోజే ( సోమవారం ) స్టాక్ మార్కెట్ ఊపందుకుంది. రెండు బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో ముగిసాయి. బీఎస్ఈ సెన్సెక్స్ రోజు కనిష్ట స్థాయి నుంచి 260 పాయింట్లకు పైగా ఎగబాకింది.
ప్రస్తుతం ప్రజలు తమ కంఫర్ట్ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సొంత ఇళ్లు, సొంత కారు ఉండాలని ప్రతి ఒక్కరు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త కారు కొనుక్కోలేని వారు ఎక్కువ మంది సెకండ్ హ్యాండ్ కారు వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.కారు కొనేటప్పుడు మీ అవసరానికి తగినట్లు ఎటువంటి కారు కొనాలో నిర్ణయించుకోవాలి. సైజ్, ఇంధన రకం, గేర్ బాక్స్, బాడీ…
దేశీయ ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ అయిన ఓలా నాలుగు ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌లను విడుదల చేసింది. తమిళనాడులోని ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో జరిగిన కార్యక్రమంలో వీటిని విడుదల చేసింది. కంపెనీ బ్యాటరీతో నడిచే స్కూటర్ S1X ధరను రూ.89,999గా నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న అనేక కంపెనీల ద్విచక్ర వాహనాల ధరలతో పోలిస్తే వీటి ధరలు తక్కువగా ఉన్నాయి. వీటి విక్రయాలు డిసెంబర్ లో ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఉన్న వాహనాలకు ధీటుగా వీటిని…