ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక అమ్మకాలు నిర్వహించనుంది. అమెజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్’ పేరుతో ఈ సేల్స్ జరుగనుండగా.. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు ఆఫర్ సేల్ ఉండనుంది.
హోండా మోటార్‌సైకిల్ తాజాగా హోండా మంకీ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను విడుదల చేసింది. ఇప్పటికే హోండా నుంచి అనేక బైక్‌లు ఇంకా స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకోగా.. ఇప్పుడు మరో కొత్త బైక్ ను విడుదల చేసింది. ఈ బైక్‌లో 125సీసీ ఇంజన్ ఉంది. లుక్ లో ఈ బైక్ బుల్లెట్ బైక్ కంటే ఎక్కువ. థాయ్‌లాండ్‌కు చెందిన హోండా ఈ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను రిలీజ్ చేసింది.
కొత్త కారు కొనాలని అనుకునే వాళ్లు.. అందులో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటే టాటా నుంచి మరొక కొత్త ఎలక్ట్రిక్ కారు రిలీజ్ కు రెడీ కానుంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన టాటా హరియర్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చి మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నారు.
ఇతర మార్కెట్లలో లాంచ్ అయిన హానర్ 90 స్మార్ట్ ఫోన్.. త్వరలో భారత మార్కెట్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఏడాది సెప్టెంబరులో భారత మార్కెట్లోకి వస్తుందని తాజా నివేదికలు చెబుతున్నాయి.
అంతర్జాతీయం, జాతీయంగా బంగారం ధరలు తగ్గాయి. అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేటు పెంపుతో శుక్రవారం బంగారం ధరలు దిగొచ్చాయి. అటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.
Business Idea: మీరు రైతు అయితే తక్కువ ఖర్చుతో మంచి లాభాలను తెచ్చే పంటను పండించాలనుకుంటే ఒక గొప్ప వ్యాపార ఆలోచన ఉంది. దీనిలో మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. ఇంకో మంచి విషయం ఏంటంటే మీరు ఉద్యోగంతో పాటు ఈ వ్యాపారంపై కూడా దృష్టి పెట్టవచ్చు.
రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు ఆపిల్ ఐఫోన్ 15 మరియు గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి. మరోవైపు గూగుల్ ఈ ఏడాది మేలో పిక్సెల్ 7ఎ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయగా.. ఇది కస్టమర్లను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు గూగుల్ నుంచి మరో ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో పిక్సెల్ 8 ప్రోని ప్రారంభించవచ్చు.
Evergrande : ఒకప్పుడు చైనా అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఎవర్‌గ్రాండే, 2021లో 300 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఎవర్‌గ్రాండే షేర్ల ట్రేడింగ్ మార్చి 2022 నుండి నిలిపివేయబడింది.
ఈశాన్య రాష్ట్రాలకు ఇండియన్ ఆయిల్ గుడ్ న్యూస్ చెప్పంది. దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో 2 కిలోల మున్నాను మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. త్వరలోనే మున్నా సిలిండర్‌ను విడుదల చేస్తామని సంస్థ చెబుతుంది. ఇండియన్ ఆయిల్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లోని మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎల్పిజి బాట్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇన్ఫ్రా డెవలప్మెంట్పై కంపెనీ పూర్తిగా దృష్టి సారించిందని చెప్పారు.