Internet Disk: స్మార్ట్ ఫోన్ అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తుంది. అందుకే ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అని తేడాలేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా గడపలేకున్నారు. అయితే ఎక్కువ మంది ఉపయోంచే యాండ్రాయిడ్ ఫోనుల్లో వివో కూడా ఒకటి. ఈ వివో ఫోన్ తయారీ సంస్థ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వివో వై56 ను విడుదల చేసిన విషయం అందరికి సుపరిచితమే. అయితే సోమవారం వివో వై56 మోడల్ లో కొత్త వేరియంట్ ను విడుదల చేసినట్లు పేర్కొంది. అప్పుడు విడుదల చేసిన వివోవై 56 8GB + 128GB ఉండేది. కాగా దీని ధర మార్కెట్లో రూ.18,999 ఉంది.
Read also:Agnipath : అగ్నివీర్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసాయ్.. కానీ సికింద్రాబాద్ ఫలితాలు ఏవీ..?
కాగా తాజాగా విడుదలైన వివో వై56 కొత్త వేరియంట్ 4GB + 128GB కలిగి ఉంది. కాగా దీని ధర మార్కెట్లో రూ.16,999 ఉంది. అయితే కొత్తగా విడుదలైన వివో వై56 వేరియంట్ ఫీచర్స్ మాత్రం మారలేదని సంస్థ పేర్కొంది. కాగా ఫోన్ ఎల్‌సీడీ తెర 6.58 అంగుళాలుంది. ఆక్టాకోర్ 5జీ ఆధారిత చిప్‌సెట్ అలానే ఉంచారు. బ్యాటరీ కెపాసిటీ 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh పొందుపరిచారు. ర్యామ్‌ను 8జీబీ వరకు విస్తరించుకోవచ్చు . ఈ ఫోన్ లో అధునాతన కెమెరా ఫ్యూచర్స్ ని పొందుపరిచారు. ప్రధాన కెమెరా 50 ఎంపీ మెయిన్ సెన్సార్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్‌తో కూడి ఉంది. అలానే 16 ఎంపీ తో ముందుకెమరా సెల్ఫీ ల కోసం పొందుపరిచారు.