దీపావళి పండుగతో మార్కెట్‌లో సందడి వాతావరణం నెలకొంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌పై బడా వ్యాపారులతో పాటు చిరు వ్యాపారుల కన్ను పడింది. నవంబర్ 23 తర్వాత దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది.. ఈ నేపథ్యంలో మార్కెట్లో షాపింగ్ మరోసారి పెరిగి రూపాయి చలామణి ప్రారంభంకానుంది.
ఈరోజు దీపావళి ముహూర్తం ట్రేడింగ్ సందర్భంగా స్టాక్ మార్కెట్‌లో అద్భుతమైన ప్రారంభం కనిపించింది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత బీఎస్‌ఈ ప్రధాన సూచీ 65,418.98 పాయింట్లకు చేరుకుంది. దీని వల్ల ఇన్వెస్టర్లు రూ. 3 లక్షల కోట్లకు పైగా ఆర్జించారు. అయితే మార్కెట్ ప్రారంభమైన 6 నిమిషాల్లోనే 345.26 పాయింట్ల లాభంతో 65,235.78 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో టాప్ 30 షేర్లు గ్రీన్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి.
చిన్న మొత్తాల పొదుపు పథకాల నిబంధనలలో ప్రభుత్వం పెద్ద సడలింపులు ఇచ్చింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (SCSS), టైమ్ డిపాజిట్ స్కీమ్ నియమాలలో మార్పులు చేశారు. ఓ నివేదిక ప్రకారం.. ఈ నిబంధనలలో మార్పుల కోసం ప్రభుత్వం నవంబర్ 9న గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం 9 రకాల చిన్న పొదుపు పథకాలను అందిస్తోంది.
Amazon: ఆర్థికమాంద్యం భయాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులు టెక్ పరిశ్రమను అతలాకుతలం చేస్తున్నాయి. ఖర్చలను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. గతేడాది నవంబర్ నుంచి మొదలైన ఉద్యోగుల తొలగింపు పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.
Voltas: ప్రముఖ వ్యాపార సంస్థ, ఉప్పు నుంచి విమానాల దాకా వ్యాపారం చేస్తున్న టాటా గ్రూప్ తన గృహోపకరణాల వ్యాపారాన్ని విక్రయిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. టాటా గ్రూప్ వోల్టాస్ హోమ్ అప్లియెన్సెస్ వ్యాపారాన్ని విక్రయించాలనుకుంటున్నట్లుగా బ్లూమ్‌బర్గ్ నివేదించింది. టాటా గ్రూపుకు వోల్టాస్‌లో 30 శాతం వాటా ఉంది. వోల్టాస్ పేరిట ఏసీలు, ఫ్రిడ్జ్‌ల వంటి హోం అప్లియెన్సెస్‌ని టాటా తయారు చేస్తోంది.
ఈ దీపావళికి SBI, PNB సహా కొన్ని బ్యాంకులు కస్టమర్లకు గృహ రుణాలపై ఆఫరు ప్రకటించాయి. ధంతేరాస్, దీపావళి సందర్భంగా జనాలు ఇళ్లు, కార్లు ఎక్కువగా కొంటుంటారు. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించడానికి.. కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు గృహ రుణాలపై మంచి ఆఫర్లను ఇస్తున్నాయి. అందులో.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులన్నీ దీపావళి 2023లో గృహ రుణాలపై పండుగ ఆఫర్‌లను ప్రకటించాయి.
IPL: క్రికెట్ ప్రపంచంలోనే కాకుండా స్పోర్ట్స్ లీగుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ధనిక లీగుల్లో ఒకటిగా మారింది. దీనిపై సౌదీ అరేబియా రాజు కన్ను పడింది. ఐపీఎల్‌లో మల్టీ బిలియన్ డాలర్ల వాటాను కొనుగోలు చేసేందుకు సౌదీ అరేబియా ఆసక్తిగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ న్యూస్ శుక్రవారం నివేదించింది.
Google: ఆర్థిక మందగమనం, ఆర్థికమాంద్యం భయాలు టెక్ ఉద్యోగుల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ కంపెనీలు ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తీసిపారేశారు. గతేడాది నవంబర్ లో ప్రారంభమైన లేఆఫ్స్ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా షాపింగ్‌మాల్స్, సూపర్ మార్కెట్లు దర్శనమిస్తున్నాయి. సూపర్మార్కెట్లలో షాపింగ్ చేసిన వారికి ఆ మాల్ వారే క్యారీ బ్యాగ్‌లు ఇస్తారు. దానికి కూడా మనం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని మాల్స్‌లో క్యారీబ్యాగ్‌లకు వాటి లోగోలు ఉంటాయి. లోగోలు ఉన్న క్యారీ బ్యాగ్‌లకు మనం డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ప్రముఖ దిగ్గజ సంస్థ రిలయన్స్.. తన జియో ఫోన్ ప్రైమ్ 4Gని విడుదల చేసింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023లో ఆ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఇక.. ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. రూ. 2,599 ఉంది.