మరో రెండు రోజుల్లో నవంబర్ నెల ముగియనుంది. అనంతరం ఈ ఏడాదిలోనే చివరి నెల డిసెంబర్ ప్రారంభం కానుంది. సాధారణంగా ప్రతినెల 1వ తేదీన కొన్ని మార్పులు జరుగుతుంటాయి. డిసెంబర్లో కూడా కొన్ని రూల్స్ మారబోతున్నాయి. ఇవి ప్రజల జీవనంపై ప్రభావం చూపనున్నాయి. పెన్షన్ పొందేవారు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి దేశవ్యాప్తంగా పెన్షనర్లకు ముఖ్యమైన వార్త. పెన్షన్ పొందడానికి 30 నవంబర్ 2022లోపు మీ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఒకవేళ ఈనెలాఖరులోగా సర్టిఫికెట్ సమర్పించకపోతే డిసెంబర్ 1…
Reliance Jio: దేశంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ జియో సేవల్లో అంతరాయం కలిగింది. నెట్వర్క్ డౌన్ కావడంతో జియో ఇంటర్నెట్, కాల్స్, ఫైబర్ సేవలు నిలిచిపోయాయని పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు జియో నెట్ వర్క్‌లో సమస్యలు ఎదురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జియో నెట్వర్క్ నుంచి కాల్స్ చేసుకునేందుకు, మాట్లాడేందుకు కుదరట్లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎస్ఎంఎస్లు పంపించేందుకు…
Airtel Recharge Plan: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ మరోసారి తన వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్ అందించింది. నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌ను ఎయిర్టెల్ 57 శాతం పెంచేసింది. 28 రోజుల మొబైల్ ఫోన్ సర్వీస్ ప్లాన్‌ను రూ.99 నుంచి ఏకంగా రూ.155కి పెంచినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఎయిర్టెల్ వినియోగదారులు అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 1 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్లు కావాలంటే రూ.155 చెల్లించాల్సి ఉంటుంది. తొలుత ట్రయల్ ప్లాన్‌గా అందుబాటులోకి తెచ్చిన ఎయిర్టెల్ త్వరలో…
Sukhant Funeral Company: ఈరోజుల్లో వ్యాపారానికి సాటిరాని వస్తువు అంటూ ఏం లేదు. ఆవుల పేడను కూడా ఆన్లైన్లో పెట్టి అమ్మేస్తున్నారు. చివరకు మనిషి చావును కూడా సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఓ స్టార్టప్ కంపెనీ మనిషి అంత్యక్రియలను నిర్వహిస్తామంటూ పబ్లిసిటీ చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. ఢిల్లీ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో ముంబైకు చెందిన సుఖాంత్ ఫ్యునరల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ మేరకు ఓ స్టాల్ పెట్టి అంత్యక్రియలను తమ కంపెనీ…
Reliance Jio: భారీ అంచనాల నడుమ ఫిఫా ప్రపంచకప్ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ మెగా టోర్నీ ప్రసార హక్కులను రిలయన్స్ సంస్థకు చెందిన వయాకామ్ 18 దక్కించుకుంది. దీంతో వయాకామ్ 18, వూట్ యాప్, జియో సినిమా యాప్ ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. వూట్ యాప్ ఈ మ్యాచ్‌లను చూడాలంటే అభిమానులు రూ.599తో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. దీంతో ఫుట్‌బాల్ అభిమానులు జియో సినిమా యాప్‌ను ఆశ్రయిస్తున్నారు. కానీ అభిమానులకు తీవ్ర నిరాశ…
Sandhya Devanathan: ప్రస్తుతం సోషల్ మీడియాను ఏలుతున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సంస్థలు మెటాలో భాగమయ్యాయి. అయితే ఆయా సంస్థలు పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరిలో మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా సంధ్య దేవనాథన్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే ఆమె నేపథ్యం గురించి చాలా మందికి తెలియదు. 46 ఏళ్ల సంధ్య దేవనాథన్ ఏపీలోని విశాఖలోనే చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో 1994లో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ఆమె ఢిల్లీ యూనివర్శిటీలో…
Twitter: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన అనంతరం బ్లూటిక్ ఛార్జీలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా బ్లూ టిక్ రూల్స్ మార్చడంతో సెలబ్రిటీల పేర్లతో నకిలీ ఖాతాలు తెరిచే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. చాలా మంది బ్లూ టిక్ కోసం చందా కట్టి నకిలీ ఖాతాలను తెరవడం ప్రారంభించారు. అయినా ఛార్జీల వసూలు విషయంలో ఎలాన్ మస్క్ తగ్గలేదు. దీంతో ట్విట్టర్ యూజర్లు.. సెలబ్రిటీల అసలు అకౌంట్ ఏదో, నకిలీ అకౌంట్ ఏదో…
Byjus: ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఫుడ్బాలర్లలో లియోనెల్ మెస్సీ ఒకరు. ఆ స్టార్ ప్లేయర్‌ని ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్.. ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ అనే సామాజిక కార్యక్రమానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ సంస్థ లేటెస్ట్గా తీసుకున్న ఈ నిర్ణయాన్ని.. ‘2ఎక్స్’ ఫౌండర్ మరియు పబ్లిక్ స్పీకర్ రిషభ్ ధేడియా తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు లింక్డిన్లో హాట్ హాట్‌గా పోస్టింగ్ పెట్టారు.
Myntra Tweet: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. పసికూనలపై రెండు హాఫ్ సెంచరీలు మినహా బలమైన జట్లపై చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ముఖ్యంగా సెమీస్ లాంటి మ్యాచ్‌లోనూ కేఎల్ రాహుల్ నిరాశపరిచాడు. దీంతో అతడి వైఫల్యంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌ను అనవసరంగా జట్టులోకి తీసుకున్నారని, అతడి ఆటకంటే బిల్డప్ ఎక్కువగా ఉంటుందని మండిపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ ట్రోలింగ్‌ను ఓ కంపెనీ…
Twitter Blue Ticks: ఎలన్ మస్క్ ఎంట్రీతో ట్విట్టర్లో భారీ మార్పులు సంభవించాయి. గతంలో ట్విట్టర్లో బ్లూటిక్ రావాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు బ్లూటిక్ కావాలంటే నెలకు రూ.719 చందా కడితే సరిపోతుంది. అయితే ఇప్పుడు నకిలీ ఖాతాలకు కూడా బ్లూటిక్కులు దర్శనమిస్తున్నాయి. దీంతో అసలు ఖాతాదారులు లబోదిబో మంటున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతల ఖాతాలకు సంబంధించి ఎక్కువ నకిలీ ఖాతాలకు బ్లూటిక్స్ కనిపిస్తుండటంతో అంతా అయోమయం నెలకొంది. బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ దుర్వినియోగం అవుతోందని…