Moody’s increases India GDP growth rate: ఆగస్టు నెల నుంచి భారత్ కు అన్నీ కలుసొసున్నట్లుగా అనిపిస్తున్నాయి. చంద్రయాన్ 3 సక్సెస్ కావడం, వరల్డ్ ఛాంపియన్ షిప్ లో నీరజ్ చోప్రాకు స్వర్ణం రావడం, ఇక తాజాగా భారత్ ఆర్థిక రంగంలో కూడా దూసుకుపోతుందన్న విషయం తెలియడం అన్నీ భారత్ కు సానుకూల అంశాలు లాగా కనిపిస్తు్న్నాయి. ఇవన్నీ భారత్ ను ప్రపంచ స్థాయిలో గర్వించేలా చేస్తున్నాయి. ఇక తాజాగా భారత ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే మరో గుడ్ న్యూస్ తెలిసింది. వృద్ధి రేటును అంచనా వేసే అంతర్జాతీయ సంస్థ మూడీస్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటును 6,2 శాతానికి పెంచింది. అయితే గతంలో మూడీస్ దీనిని 5.5 శాతంగా అంచనా వేసింది. అయితే ఏప్రిల్-జూన్ 2023 త్రైమాసికంలో, సేవా రంగంలో వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగడానికి సహాయపడిందని మూడీస్ తెలిపింది.
ఇది మాత్రమే కాకుండా డ్యూయిష్ బ్యాంక్ కూడా భారతదేశ వృద్ధి అంచనాను 20 బేసిస్ పాయింట్లు పెంచి 2023లో 6.2 శాతానికి పెంచింది. ఇక మరోవైపు మోర్గాన్ స్టాన్లీ కూడా భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను 6.4 శాతానికి పెంచింది. ఇక 2023 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. అదే సమయంలో, రిజర్వ్ బ్యాంక్ అంచనా ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సంవత్సరం చివరి త్రైమాసికంలో అంటే అక్టోబర్-డిసెంబర్ 2023లో 6 శాతం ఉండవచ్చు.
Also Read: Viral Video: వీడసలు మనిషేనా.. కుక్క మెడకు తాడు కట్టి నేలకేసి కొట్టి కొట్టి చంపాడు దుర్మార్గుడు
ఇక మూడీ వేసిన ఆర్థిక వృద్ధి అంచనాలలో భారత్ చైనా కంటే ముందు ఉంది. ఇంతకుముందు చైనా 4.5 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంచనా వేయగా.. తాజాగా దానిని 4 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది మూడీస్. చైనా ఆర్థిక వ్యవస్థకు వృద్ధిపరమైన సవాళ్ల రీత్యా 2024కు ఆ దేశ వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తున్నట్లు మూడీస్ తెలిపింది. 2023 తొలి అర్ధభాగంలో భారత్ సహా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తమ అంచనాలకు మించి రాణించాయని పేర్కొంది ఈ అంతర్జాతీయ సంస్థ. అయితే 2024కు భారత వృద్ధి రేటు అంచనాలను మాత్రం 6.5 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది. అధిక బేస్ రేట్ కారణంగా ఇలా తగ్గించడం జరిగిందని మూడీస్ పేర్కొంది. ఇక తాజాగా ఆర్బీఐ గవర్నర్ కు అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రకటించిన రిపోర్డు కార్డుడులో ఆయన ప్రపంచవ్యాప్తంగా టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా A+ ర్యాంకును పొంది ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. భారత్ మంచి నిర్ణయాలతో ముందుకు వెళుతుంది అనడానికి ఇది నిదర్శనం అంటూ ప్రధాని మోదీ కూడా శక్తికాంత దాస్ ను కొనియాడారు.