Demonetisation: 2016లో బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పటికీ నోట్ల రద్దు ఎఫెక్ట్ భారత ఆర్ధిక వ్యవస్థపై కొనసాగుతుంది. నోట్ల రద్దు కారణంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రూ.2వేలు నోటుతో సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2016 నాటి నోట్ల రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం నాడు ఈ పిటిషన్లను…
Suven Pharma: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సువెన్ ఫార్మాస్యుటికల్స్లో మెజారిటీ వాటా కొనుగోలు పట్ల రెండు ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. బ్లాక్‌స్టోన్ మరియు అడ్వెంట్ ఇంటర్నేషనల్ అనే కంపెనీలు సువెన్ ఫార్మాలో షేర్ కోసం విడివిడిగా సంప్రదింపులు జరుపుతున్నాయని స్టాక్ మార్కెట్ వర్గాల సమాచారం. సువెన్ ఫార్మాలో షేరును విక్రయించే విషయం ప్రమోటర్ల పరిశీలనలో ఉందనే వార్తలు ఇంతకు ముందు కూడా వచ్చాయి.
Gold Rates: దేశవ్యాప్తంగా బంగారం కొనాలని భావించేవారికి శుభవార్త అందింది. తాజాగా 10 గ్రాముల బంగారం ధర రూ.600 మేర దిగి వచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10గ్రాములపై రూ.600 తగ్గింది. ప్రస్తుతం రూ.46,100గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10గ్రాములపై రూ.660 తగ్గింది. ప్రస్తుతం రూ.50,290గా ఉంది. కానీ వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండిపై రూ.400 పెరిగింది. ప్రస్తుతం రూ.64,400గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లోనూ…
Edible Oil Prices: సామాన్యులకు మళ్లీ షాక్ తగలనుంది. ఇటీవల తగ్గుముఖం పట్టిన వంటనూనె ధరలు మళ్లీ పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. గతంలో లీటర్ వంటనూనె రూ.200 దాటగా అప్రమత్తమైన కేంద్రం తగుచర్యలు తీసుకోవడంతో ధరలు తగ్గాయి. ప్రస్తుతం లీటర్ ఆయిల్ ప్యాకెట్ రూ.140-150కి లభిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పామాయిల్ దిగుమతి సుంకాలను 6 నుంచి 11 శాతం పెంచనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయిల్ దిగుమతి సుంకాలు పెంచడంతో ఆ భారం…
Gas Prices: ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు తీపికబురు అందించాయి. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ధర తగ్గింపు వల్ల కేవలం కొంత మందికి మాత్రమే ఊరట లభించనుంది. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును మాత్రమే తగ్గించాయి. సాధారణంగా ఇళ్లలో ఉపయోగించే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం స్థిరంగానే కొనసాగించాయి. Read Also:…
Petrol Prices: దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పెట్రోల్, డీజిల్‌పై చెరో 40 పైసలు తగ్గనున్నట్లు సోమవారం నాడు కేంద్రం ప్రకటించింది. దీంతో దేశంలో మరోసారి ఇంధన ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ.109.64, డీజిల్ రూ.97.8గా ఉంది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.67, డీజిల్ ధర రూ.99.40గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో…
Instagram Down: ప్రస్తుతం సోషల్ మీడియా అంటే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. దాదాపుగా అందరూ వీటిని వాడుతున్నారు. యువత ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ మీదే ఆధారపడుతోంది. ఇన్‌స్టా రీల్స్ చూస్తూ సమయం గడిపేస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సోమవారం నాడు ఇన్స్టాగ్రామ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలామంది అకౌంట్లు లాక్ అయిపోయినట్లు ఫిర్యాదులు పోటెత్తాయి. తమ యాప్ క్రాష్ అవుతోందని పలువురు యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. సుమారు 7వేల అకౌంట్లు సస్పెండ్ అయినట్లు సమాచారం అందుతోంది. ఈ…
Energy Demand in India: ఈ దశాబ్దంలో ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఇండియాలోనే ఎనర్జీకి భారీగా డిమాండ్ పెరగనుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనా వేసింది. లేటెస్టుగా విడుదల చేసిన వరల్డ్ ఎనర్జీ ఔట్‌లుక్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ నేపథ్యంలో భారతదేశంలో ఎనర్జీకి గిరాకీ ఏటా 3 శాతం పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలిపింది. 2025 నాటికి ఇండియా అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఎదగనుండటం మరో కారణమని పేర్కొంది.
Human Washing Machine: ఈరోజుల్లో ప్రతి ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటోంది. ఒకప్పుడు చేత్తో బట్టలు ఉతికేవాళ్లు. ఇది ఎంతో శ్రమతో కూడుకున్న పని. అయితే ఇప్పుడు వాషింగ్ మెషిన్ అందుబాటులో ఉండటంతో పని సులువుగా మారిపోయింది. వాషింగ్ మెషీన్ కారణంగా గృహిణీలకు పనిభారం కూడా ఎంతో తగ్గింది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడంతో బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్ కాకుండా మనుషులను ఉతికే వాషింగ్ మెషిన్ కూడా రాబోతోంది. ఈ యంత్రాన్ని జపాన్‌కు చెందిన కంపెనీ…
Hyderabad to Thailand: హైదరాబాద్, థాయ్‌లాండ్ మధ్య ప్రయాణికులతోపాటు సరుకులకు సంబంధించిన విమాన సర్వీసులు కూడా రెండేళ్ల విరామం అనంతరం ఎల్లుండి నుంచి పున:ప్రారంభం కానున్నాయి. కొవిడ్ వల్ల నిలిచిపోయిన ఈ సేవలు మళ్లీ మొదలవుతుండటం ఔషధాల వంటి ముఖ్యమైన ప్రొడక్టుల రవాణాకు, పర్యాటకుల రాకపోకలకు ఉపయుక్తంగా ఉంటుందని థాయ్ కాన్సులేట్ జనరల్ నిటిరూగ్ ఫోన్ ప్రాసెర్ట్ హర్షం వ్యక్తం చేశారు.