Stock Market : స్టాక్ మార్కెట్ కొత్త రికార్డు.. సెన్సెక్స్ 72000 దిశగా, 21500 దాటిన నిఫ్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market : సెన్సెక్స్ ఈరోజు మరో కొత్త చరిత్ర సృష్టించింది. సెన్సెక్స్ 72000, నిఫ్టీ 21500 దాటాయి. ఈరోజు సెన్సెక్స్ సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 71647 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ కూడా చరిత్ర సృష్టించింది. 21543 స్థాయిలో ప్రారంభమైంది. బుధవారం సెన్సెక్స్ 210 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 90 పాయింట్లు లాభపడింది. అంతకుముందు మంగళవారం, సెన్సెక్స్ ఆల్ టైమ్ 71623.7కి చేరుకుంది. డిసెంబర్ 8వ తేదీనే 21000 పాయింట్ల స్థాయిని దాటి ప్రస్తుతం 22000 వేల దిశగా పయనిస్తోంది. ప్రస్తుత సంవత్సరంలో నిఫ్టీలో 2900 పాయింట్ల భారీ జంప్ కనిపించింది. డిసెంబర్ 30, 2022న ఇది 18,105 స్థాయిలో ఉంది.
Read Also:Extra Ordinary Man: ఓటీటీలోకి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఎక్కడ స్ట్రీమింగంటే?
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ 71832 వద్ద సరికొత్త శిఖరాన్ని తాకింది. ఇది జరిగిన కొద్దిసేపటికే సెన్సెక్స్ మరో కొత్త గరిష్ట స్థాయి 71866కు చేరుకుంది. కాగా, నిఫ్టీ 21577 వద్దకు చేరుకుంది. బీఎస్‌ఈలో 2701 స్టాక్‌లు ట్రేడవుతున్నాయి. వీటిలో ఎరుపు రంగులో 527, ఆకుపచ్చ రంగులో 2096 మాత్రమే ఉన్నాయి. ఈ కాలంలో 113 స్టాక్‌లు అప్పర్ సర్క్యూట్‌లో, 43 లోయర్ సర్క్యూట్‌లో ఉన్నాయి. ఇది కాకుండా 187 స్టాక్‌లు 52 వారాల గరిష్ఠ స్థాయి వద్ద ట్రేడవుతుండగా 8 మాత్రమే కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.
Read Also:RBI Penalty: బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా.. జరిమానాల వల్ల కస్టమర్లపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే ?
నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో టెక్ మహీంద్రా 1.92 శాతం పెరిగి రూ.1306కు చేరుకుంది. ఎల్‌టీఐ మైండ్ ట్రీ 1.48 శాతం పెరిగి రూ.6203.40 వద్ద ఉంది. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌లు కూడా ఒక శాతానికిపైగా పెరిగాయి. కాగా, నిఫ్టీ టాప్ లూజర్లలో మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ ఉన్నాయి. మరోవైపు అదానీ గ్రూప్ షేర్లు కూడా పెరుగుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో, అదానీ ఎనర్జీ సొల్యూషన్ 4.46 శాతం పెరిగి రూ.1124.20కి చేరుకుంది. అదానీ పవర్ దాదాపు 0.36 శాతం పెరిగి రూ.537.40 వద్ద ఉంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2951.60కి చేరుకుంది. కాగా, ఈరోజు కూడా అదానీ టోటల్ గ్యాస్ 0.77 శాతం పెరిగి రూ.1034.20 వద్ద, అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.1542.90 వద్ద ఉంది. అదానీ పోర్ట్ కూడా 0.60 శాతం పెరిగి రూ.1080.45 వద్ద ట్రేడవుతోంది.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!