హన్మకొండలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. 80 మంది ప్రయాణికులతో బస్సు రన్నీంగ్‌లో ఉండగా బస్సు టైర్ ఊడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కరీంనగర్-వరంగల్ జాతీయ ప్రధాన రహదారిపై ఆదివారం హుజరాబాద్ నుండి హనుమకొండ వైపు పల్లె వెలుగు బస్సు బయలుదేరింది. Also Read: Bihar: “తల్లిని మించిన యోధులు లేరు”.. ప్రాణాలను అడ్డుపెట్టి పిల్లల్ని రక్షించింది.. వీడియో వైరల్..…
జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటన దోడా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యు టీం ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. బుధవారం ఉదయం బస్సు 40 మంది ప్రయాణికులతో కిష్త్వార్ నుంచి జమ్మూ…
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండులో దుర్ఘటనతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ బస్సు యాక్సిడెంట్ పై నివేదిక సిద్ధమైంది. నివేదికపై అధికారులతో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు చర్చిస్తున్నారు.
4 dead and several injured in Rajasthan Bus Accident: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో అదుపు తప్పిన ఓ బస్సు.. బ్రిడ్జి పైనుంచి రైల్వే ట్రాక్ (రైలు పట్టాలు)పై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 2.15 గంటలకు చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు…
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కూనూర్‌లోని మరపాలెం సమీపంలో టూరిస్ట్ బస్సు లోయలో పడిపోవడంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 35 మందికి గాయాలయ్యాయి. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు బస్సులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.