Vijayawada Bus Accident: బస్సు ప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Bus Accident: విజయవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ బస్టాండ్‌లో జరిగిన ప్రమాదంపై విచారణం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశాలు జారీ చేశారు.. ఇక బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.. విజయవాడ బస్టాండ్‌లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం.. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం ముఖ్యమంత్రికి ప్రమాద ఘటనపై వివరాలను అధికారులు అందించారు. ఆర్టీబస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్‌ఫాంమీదకు దూసుకుపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని, గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.
కాగా, ఈ రోజు ఉదయం విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ బస్టాండ్‌లో 12వ నంబర్ ఫ్లాట్‌ఫైమ్‌కి దూసుకెళ్లింది బస్సు.. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. కండెక్టర్‌తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. కాంట్రాక్ట్ కండక్టర్, ఓ మహిళ, 10 నెలల చిన్నారి కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఇలా జరిగిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు..
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ఇక, బస్సు ప్రమాదంపై మీడియాతో మాట్లాడిన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు.. ఉదయం 8:45 కి దురదృష్టకర యాక్సిడెంట్ జరిగింది.. 26 మంది ప్రయాణికులతో బస్సు బయల్దేరినప్పుడు ప్రమాదం జరిగిందన్నారు.. కుమారి అనే ప్రయాణికురాలు, ఔట్ సోర్సింగ్ బుకింగ్ క్లర్క్ స్పాట్ లో చనిపోయారు.. యాంత్రిక లోపమా, మానవ తప్పిదమా అనేది తేలాల్సి ఉందన్నారు. ఒక చిన్నారి అయాన్షు ఆసుపత్రికి వెళ్ళాక మరణించింది.. ఒక ఔట్ సోర్సింగ్ క్లర్క్, ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి అన్నారు. చనిపోయిన వారికి ఏపీఎస్ఆర్టీసీ తరఫున రూ. 5 లక్షలు ఎక్సగ్రేషియా ప్రకటిస్తున్నాం.. గాయపడిన వారికి మా ఖర్చులతో వైద్యం చేయిస్తాం అన్నారు. మరోవైపు.. ప్రమాదానికి గురైన బస్సు కండిషన్ చాలా బాగుందని తెలిపారు. డ్రైవర్ చెప్పినదే కాకుండా టెక్నికల్ గా కూడా పరిశీలిస్తాం.. ఈ మధ్య డ్రైవర్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో సెలవులో ఉన్నాడు.. అయితే, పూర్తిగా ఆరోగ్యంగా తిరిగి డ్యూటీలో చేరాడు అని వెల్లడించారు.. ఎవరి తప్పిదం అయితే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు.
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!