ఉత్తరాఖండ్‌లో దారుణఘటన చోటు చేసుకుంది. లోయలో బస్సు పడిపోవడంతో 13 మంది మృతి చెందారు. అంతేకాకుండా చాలా మందికి తీవ్ర గాయాలవడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని చక్రటలో గల బులద్-బైలా రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదస్థలం కొండలోయలో కావడంతో అత్యవసర సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డెహ్రడూన్‌కు ఘటన స్థలం 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సేవలు అందిస్తున్నారు. బస్సు…
శ్రీకాకుళంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులతో పాఠశాలకు బయలు దేరిన స్కూల్ బస్సు చెరువులో పడిపోయింది. బుధవారం ఉదయం ఎచ్చెర్ల మండలంలోని కొయ్యం గ్రామ సమీపంలోని నల్ల చెరువులో ఈ ఘటన జరిగింది. 8 మంది విద్యార్థులతో వెళుతున్న స్కూల్ బస్సు చెరువులో పడిపోవడంతో.. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను కాపాడారు.. అప్పటికే ఒక విద్యార్థి మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. విద్యార్థి మృతితో ఆ…
మెక్సికో దేశంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఈశాన్య మెక్సికోలోని తమౌలీపాస్ రాష్ట్రంలో బస్సు ప్రమాదం జరిగింది. రేనోసా-న్యూవోలియోన్ మోంటెర్రే మధ్య బస్సు ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు వేగంగా ప్రయాణం చేస్తుండటంతో అదుపు తప్పి బోల్తా కొట్టింది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అక్కడికక్కడే 9 మంది మృతి చెందగా, మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించగా…