ఏపీలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద 30వ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఓ మలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉండటంతో బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నాడు. బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి గాయాలయ్యాయి. కాగా క్షతగాత్రులను స్థానికులు వెంటనే చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.…
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబురిగి జిల్లా కమలాపురలో కంటైనర్ ట్రక్కును ఢీ కొట్టి బస్సు బోల్తాపడింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని నలుగు సజీవ దహనం మయ్యారు. హుటా హుటిన చేరుకున్న పోలీసులు ప్రయాణికులను ఆసుపత్రికి తరలిస్తుండగా నలుగురు మృత్యువాత పడ్డారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సులో మొత్తం డ్రైవర్ తో సహా 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన అనంతరం కొందరు సురక్షితంగా బయట పడినట్లు స్థానిక పోలీసులు…
జమ్మూలో ఘోర ప్రమాదం జరిగింది. కట్రా నుంచి జమ్మూకు వెల్లే బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. బస్సులో మంటలు చెలరేగిన వెంటనే ఇద్దరు ప్రయాణికులు సజీవ దహనం కాగా… మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంజిన్ నుంచి మంటలు రావడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన కొద్ది సమయంలోనే…
తిరుపతిలోని చంద్రగిరి మండలం బాకరాపేట ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మవరం నుంచి తిరుపతి వస్తున్న పెళ్లి బృందం బస్సు లోయలో పడింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా, సుమారు 300 అడుగుల లోయలో పడ్డ బస్సు పడిపోయింది. అయితే ఈ ఘటనపై తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. భాకరాపేట లోయలో ప్రమాదం శోచనీయమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారని,…
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. యాదాద్రి జిల్లాలోని ఆలేరు బైపాస్ రోడ్డులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ ప్రాంతంలో ట్రాక్టర్ ఉండి. ఆ పక్కనే కూలీలు పని చేస్తున్నారు. ఈ సమయంలో వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. అయితే, వేగంగా వచ్చిన…
రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమక్క-సారక్క జాతర గురించి ప్రత్యేకంగా చెప్పనెక్కర్లేదు. సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. అయితే ఇలా మేడారం జాతరకు బయలుదేరిన ఓ కుటుంబ ప్రయాణం విషాదాంతంగా ముగిసింది. ఎంతో ఆనందంగా అమ్మవార్ల దర్శనం కోసం ఇంటి నుంచి మేడారంకు కారులో ఓ కుటుంబం బయలు దేరింది. అయితే ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం వద్దకు రాగానే ఆర్టీసీ బస్సును కారు…
కాన్పూర్‌లోని టాట్ మిల్ క్రాస్‌రోడ్ సమీపంలో ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పాదచారులపైకి దూసుకువచ్చిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. అంతేకాకుండా పలువురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో 15 మంది పాదచారులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. టాట్ మిల్ ఇంక్లైన్‌లో బస్సు బ్రేక్‌లు పనిచేయకపోవడంతో కార్లు, బైకులు, పాదచారులను ఢీకొట్టాయని కాన్పూర్ ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ప్రమోద్ కుమార్ తెలిపారు. 9 మంది…
పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం తప్పింది. ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం శివారులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు కట్టలు విరిగిపోవడంతో బస్సు వెనక టైర్లపై ఒరిగిపోయింది బస్. ప్రమాదం సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ బస్సుని పోలవరం కుడికాలువ బ్రిడ్జి వద్ద నిలిపివేశారు డ్రైవర్. ఘోర ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు ప్రయాణికులు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు వున్నట్టు తెలుస్తోంది. ద్వారకాతిరుమల నుండి ఏలూరు వెళుతుండగా…
పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. జంగారెడ్డిగూడెం సమీపంలో డివైడర్‌ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడిపోయింది.. అశ్వారావుపేట నుండి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ చిన్నారావు, తొమ్మిది మంది ప్రయాణికులు సహా మొత్తం 10 మంది మృతిచెందారు.. మరికొందరి పరిస్ధితి విషమంగా ఉంది.. అయితే, ఆ ప్రమాదానికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. Read…