Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Whisky Business: దేశంలోని ప్రముఖ మద్యం తయారీ సంస్థల్లో ఒకటైన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) భారీ లాభాలను నమోదు చేసింది. డయాజియో నియంత్రణలో ఉన్న ఈ సంస్థ, FY2027 జూన్ త్రైమాసిక ఫలితాలను తాజాగా వెల్లడించింది. ఈ కాలంలో కంపెనీ ఏకీకృత నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 51.55 శాతం పెరిగి రూ.391 కోట్లకు చేరింది. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో USL రూ.258 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. తాజాగా అదే కాలంలో లాభాల్లో భారీ వృద్ధిని సాధించింది. ఇక కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరిగింది. జూన్ త్రైమాసికంలో USL ఆదాయం 4.98 శాతం వృద్ధితో రూ.6,113 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.5,823 కోట్లుగా ఉంది. అలాగే ఇతర ఆదాయాలతో కలిపిన మొత్తం ఆదాయం 7.66 శాతం పెరిగి రూ.6,335 కోట్లకు చేరింది. కంపెనీ మొత్తం ఖర్చులు కూడా స్వల్పంగా పెరిగాయి. జూన్ త్రైమాసికంలో మొత్తం వ్యయాలు 4.63 శాతం పెరిగి రూ.5,781 కోట్లుగా నమోదయ్యాయి.
ఈ సందర్భంగా USL సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సోమేశ్వర్ మాట్లాడుతూ.. FY2027ను కంపెనీ బలమైన వృద్ధితో ప్రారంభించిందని తెలిపారు. ముఖ్యంగా ‘ప్రెస్టీజ్ అండ్ అబవ్’ (P&A) విభాగంలో రెండంకెల వృద్ధి సాధించినట్లు వెల్లడించారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో మరింత వృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. కంపెనీ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ వాటాదారులకు దీర్ఘకాలిక విలువను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. FY2027 తొలి త్రైమాసికంలో USL నికర అమ్మకాల విలువ (NSV) రూ.2,703 కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 6 శాతం వృద్ధి అని కంపెనీ తెలిపింది. కంపెనీ మంచి ఫలితాలు సాధించినప్పటికీ, కొన్ని రాష్ట్రాల విధాన మార్పులు ప్రభావం చూపినట్లు తెలిపింది. ముఖ్యంగా మహారాష్ట్రలోని ప్రతికూల విధాన నిర్ణయాలు, కర్ణాటకలో ఎక్సైజ్ విధాన మార్పులు కొన్ని విభాగాల ఆదాయంపై ప్రభావం చూపినట్లు పేర్కొంది. ‘ప్రెస్టీజ్ అండ్ అబవ్’ విభాగం 10.1 శాతం వృద్ధి సాధించగా, ‘పాపులర్’ విభాగం NSV మాత్రం 17.5 శాతం తగ్గి రూ.206 కోట్లకు చేరింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ నికర అమ్మకాలలో P&A విభాగం 91.7 శాతం వాటాను కలిగి ఉండగా, పాపులర్ విభాగం 7.6 శాతం వాటాను కలిగి ఉంది. మరోవైపు, USL షేర్లు కూడా మార్కెట్లో సానుకూలంగా స్పందించాయి.
Also Read
- Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
- Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
- Jio Platforms IPO Listing: నేడు స్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. GMP రూ.247, లిస్టింగ్ ధర ఎంత ఉండొచ్చు?
- BCG Report 2026: పెట్రోల్ యుగానికి బ్రేక్ పడనుందా? భారత టూ వీలర్ మార్కెట్లో కొత్త ట్రెండ్..
తాజావార్తలు
-
Supreme Court: ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..
-
Artificial Paneer Ban in AP: ఏపీలో పన్నీరు అమ్మకాలు బంద్..! ఏడాది పాటు నిషేధం
-
Husharu 2: చాలా ఏళ్ల తర్వాత నాకు మంచి రోల్ దక్కింది: ఆర్. నారాయణమూర్తి
-
El Nino: ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో కరువు ముప్పుపై అఖిలపక్ష భేటీ
-
Abhijeet Dipke: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల తొలగింపు.. కేంద్రంపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!