యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. యాదాద్రి జిల్లాలోని ఆలేరు బైపాస్ రోడ్డులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ ప్రాంతంలో ట్రాక్టర్ ఉండి. ఆ పక్కనే కూలీలు పని చేస్తున్నారు. ఈ సమయంలో వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. అయితే, వేగంగా వచ్చిన బస్సు ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ ట్రాక్టర్ కాస్తా పని చేస్తున్న కూలీలను ఢీకొట్టింది.
ఈ ఘటనలో నలుగురు కూలీలు స్పాట్‌లోనే చనిపోయాగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులంతా భువనగిరి మండలం రాయగిరికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.