Viral Video, Ox climbed on Building Due to Rain in Palakollu: భారతదేశ వ్యాప్తంగా గత 10 రోజులుగా వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు వానలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఓ వైపు వరదలు, మరోవైపు వర్షపు చినుకులతో జనాలు అల్లాడిపోతున్నారు. కొందరు అయితే చలితో వణికిపోతున్నారు కూడా. ఇందుకు జంతువులు కూడా అతీతమేమీ కాదు. వర్షాలకు తట్టుకోలేక సరైన చోటు కోసం వెతుకుతుంటాయి. తాజాగా ఓ ఆంబోతు…
గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఓ రెండు అంతస్థుల బిల్డింగ్ కూలిపోయింది. దీంతో ఆ భవనం శిథిలాల కింద నలుగురు చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని దాతర్ రోడ్‌లోని కడియావాడ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో.. బిల్డింగ్ పాతది కావడంతో కూలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
ముంబైలో వర్షాలు దంచికొడుతున్నాయి. శనివారం నుంచి మహానగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆదివారం ఘట్‌కోపర్ ప్రాంతంలో ఓ భవనంలో కొంతభాగం కుప్పకూలింది. దీంతో చాలా వరకు ఆస్తినష్టం వాటిల్లింది. అంతేకాకుండా శిథిలాల కింద ఆరుగురు చిక్కుకున్నారు. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు నలుగురిని సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే వారిని ప్రథమ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు తెలుపుతున్నారు.
చింతల్ లోని శ్రీనివాసనగర్ కు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి 25 ఏళ్ల కిందటే ఇల్లు కట్టుకున్నాడు. అప్పటికి రోడ్డుకు సమాంతరంగా ఉంది. కానీ, కాలక్రమేణా ఇంటి ముందు రోడ్డు ఎత్తు పెరగడంతో వర్షాకాలం వచ్చిందంటే ఇంట్లోనే వరద నీరు చేరింది.
సికింద్రాబాద్ మినస్టర్ రోడ్ లోని డెక్కన్ స్పోర్ట్స్ భవనం కూల్చివేత పనులు నిన్న అర్థరాత్రి 11 గంటల నుంచి 2 గంటలకు వరకు కొనసాగించారు. 2గంటల తర్వాత కూల్చివేత పనులు తాత్కాలికంగా నిలిపివేశారు.
నగరంలోని ఎల్బీనగర్ లో దారుణం చోటుచేసుకుంది. పాలు ప్యాకెట్ తెస్తానని ఇంటినుంచి బయటకు వెళ్లిన 9 ఏళ్ల చిన్నారి శవమైంది. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నగరంలోని ఎల్బీనగర్ లోని చింతల్ కుంట- మధురానగర్ కాలనీ లో ఓ కుటుంబం నివాసం వుంటున్నారు. వారికి వర్షిత అనే 9 ఏళ్ల చిన్నారి ఉంది. నిన్న మంగళవారం ఇంట్లో నుండి పాల ప్యాకెట్ కోసం వెళ్లింది వర్షిత. అయితే.. వెళ్లిన కూతురు ఎంతసేపటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు ఆందోళన…
దుబాయ్ లోని ఓ సాప్టర్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి తనకూతురు పుట్టినరోజు సందర్బంగా నగరానికి వచ్చాడు. ఘనంగా పుట్టిన రోజు వేడుకలు చేద్దామని అనుకున్నాడు. కానీ.. విధి వక్రిస్తుందని ఆలోచించలేకపోయాడు. ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు టెర్రస్‌పై నుంచి పడి మృతి చెందాడు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన నాగ సందీప్(32), భార్య సింధూజ, కూతురుతో కలిసి దీప్తీశ్రీనగర్‌లోని విశ్వం ఎలైట్స్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. నాగ సందీప్ దుబయ్‌లోని ఓ సాఫ్ట్‌వేర్…