Bull Viral Video: వర్షాలకు తట్టుకోలేక.. బిల్డింగ్‌పైకి ఎక్కిన ఆంబోతు! వైరల్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video, Ox climbed on Building Due to Rain in Palakollu: భారతదేశ వ్యాప్తంగా గత 10 రోజులుగా వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు వానలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఓ వైపు వరదలు, మరోవైపు వర్షపు చినుకులతో జనాలు అల్లాడిపోతున్నారు. కొందరు అయితే చలితో వణికిపోతున్నారు కూడా. ఇందుకు జంతువులు కూడా అతీతమేమీ కాదు. వర్షాలకు తట్టుకోలేక సరైన చోటు కోసం వెతుకుతుంటాయి. తాజాగా ఓ ఆంబోతు కూడా ఇదే పని చేసింది. వర్షాలకు తట్టుకోలేక బిల్డింగ్ కారిడార్‌లోకి వెళ్లింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
భారీ వర్షానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఓపెన్ ఏర్ థియేటర్ రోడ్డులోని ఓ బిల్డింగ్‌పైకి ఆంబోతు ఎక్కింది. మంగళవారం కురిసిన వర్షానికి రాత్రి సమయంలో మెట్ల ద్వారా బిల్డింగ్‌పైకి ఆంబోతు ఎక్కింది. అధికారి కంప్యూటర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ బిల్డింగ్ కారిడార్‌లో హాయిగా సేదతీరుతోంది. ఉదయం ఈ ఘటన చూసిన జనాలు ఆంబోతును చూసి తెగ నవ్వుకుంటున్నారు.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
Also Read: TS Crime News: వీడియోస్ చేస్తుందని.. చెల్లిపై రోకలిబండతో దాడి చేసిన అన్న! చివరకు..
ఆంబోతు బెదిరితే రోడ్డుపైకి దూకేస్తుందేమో అని ఓపెన్ ఏర్ థియేటర్ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇక ఆంబోతు కారిడార్‌లోకి ఉండడంతో ఆ బిల్డింగ్ డోర్స్ అన్ని క్లోజ్ అయ్యే ఉన్నాయి. అక్కడికి వచ్చిన జనాలు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్త వైరల్ అయింది. ఈ వీడియో చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ‘వర్షాలకు తట్టుకోలేక బిల్డింగ్‌పైకి ఎక్కిన ఆంబోతు’, ‘ఈ ఆంబోతు చాలా తెలివైనది గురూ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు