కుక్కలు, ఏనుగులు, చిరుత పులుల దాడుల గురించి మనం విన్నాం, చూశాం. కానీ కోతుల దాడి గురించి విన్నారా. ఆ కోతులు దాడులు చేస్తే ఆ ప్రభావం ఎలా వుంటుందో చెప్పలేం. తాజాగా కోతుల దాడిలో ఓ యువకుడి రెండు కాళ్లు విరిగి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని రంగసాయిపేట ముదిరాజు వాడకు చెందిన అరవింద్ ఇంటిపైన ట్యాంక్ వద్ద పైపులను సరిచేసి వస్తుండగా 50 కోతులు ఒకేసారి దాడి చేయడంతో భవనం పై నుండి పడడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి.
Read Also: IRCTC Contractor Fined: రూ. 5 ఎక్కువగా వసూలు చేశాడు.. ఒక లక్ష ఫైన్ కట్టాడు
ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అరవింద్ చికిత్స పొందుతున్నాడు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కోతులను పడుతున్నామని ప్రచారానికే పరిమితం అయ్యారని నగరంలో పలు కాలనీలలో కోతుల బెడద తీవ్రంగా ఉందని ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి కోతులను పట్టి అడవిలో వదిలి నగర ప్రజల ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నానని అరవింద్ తెలిపారు. ఇటీవలి కాలంలో కోతుల బెడద ఎక్కువైందని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదంటున్నారు వరంగల్ వాసులు. ఎంతో భవిష్యత్ వున్న అరవింద్ కాళ్లు విరగ్గొట్టుకుని మంచం పాలయ్యాడు. కోతులు, కుక్కల విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదం తెస్తుందో ఈ ఘటనే నిదర్శనం అంటున్నారు వరంగల్ వాసులు.
Read Also:Bhatti Vikramarka: వలస వాదులతో అసలు వారికి నష్టం జరిగింది