హైదరాబాద్ లో ఘోర ప్రమాదం సంభవించింది. కూకట్ పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. కూకట్ పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం శ్లాబ్ కూలిన ఘటనలో విషాదం నెలకొంది. ఈ ఘటనలో ఒక కార్మికుడు మరణించాడు. శిథిలాల క్రింద ఓ కార్మికుడు మృత దేహాన్ని బయటకు తీశారు రెస్క్యూ టీం.పై అంతస్తులో శ్లాబ్ వేసేందుకు పనులు చేస్తుండగా అది కూలిపోయింది. స్లాబ్ కింద ఎవరైనా ఉన్నారేమోనని అనుమానిస్తున్నారు స్థానికులు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు తీసుకుంటున్నారు. 4,5 వ అంతస్తుకు స్లాబ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది స్లాబ్…రెడీ మిక్స్ కింద ఇద్దరు కూలీలు చిక్కుకొని ఉంటారని తోటి కార్మికులు అంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ,రెస్క్యూ టీం,స్థానిక పోలీసులు శిథిలాలు తొలగించే పనిలో నిమగ్నం అయ్యారు.అసలు ప్రమాదం ఎలా జరిగింది? నిర్మాణంలో ఉన్న భవనం కింద ఎంతమంది ఉన్నారు అనేది అధికారులు ఆరాతీస్తున్నారు. నాణ్యతా లోపం వల్ల జరిగిందా? ఇంకా ఏమైనా కారణాలు వున్నాయా అనేది విచారిస్తున్నారు. పనికి వచ్చిన కార్మికుల వివరాలు సేకరిస్తున్నారు.