Purandeswari On Budameru: నేడు శుక్రవారం బుడమేరు గండి పూడిక పనులను పరిశీలించారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బుడమేరు గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయని., గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండ్లు పడ్డాయని ఆరోపించారు. ప్రతి సందర్బంలోనూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదని.. రూ. 400 కోట్లతో బుడమేకు కట్ట పటిష్టతకు టీడీపీ పనులు ప్రారంభించిన.. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని కొనసాగించ లేదని ఆమె తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో బుడమేరుకు వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పాలని ఆమె కోరారు.
Khammam: ఖమ్మంలో శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్, భట్టి విక్రమార్క ఏరియల్ సర్వే..
కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రాన్ని వరదల్లో ఆదుకుంటోందని., గురువారంనాడు క్షేత్ర స్థాయిలో కేంద్ర మంత్రి చౌహన్ పర్యటించారని., త్వరలో ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేసి సాయం అందిస్తారని పురందేశ్వరి తెలిపారు. ఇక ఏపీ రాష్ట్ర యంత్రాంగం మొత్తం విజయవాడను కాపాడడానికి శతవిధాల కష్టపడుతున్నారు. ముక్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోనే మక్కాము వేసి అధికారులను సహాయ చర్యలు చేపెట్టేలా విధులు నిర్వహిస్తున్నారు.
Ott Release: రెండు చిన్న సినిమాలు.. రెండు ఓటీటీలలో ఒకేసారి స్ట్రీమింగ్..