కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి బుధవారం బెంగళూరులో కావేరీ నీటి సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం నుంచి 75 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రకటించడంపై ఘాటుగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప.
రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించాలని పిలుపునిచ్చిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం బిఎస్ యడియూరప్పపై జగదీష్ షెట్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఒత్తిడి మేరకు యడియూరప్ప ఈ మాటలు చెబుతున్నారని షెట్టర్ అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాయకుల మధ్య విమర్శలు, ఆరోపణల పర్వం తీవ్రమైంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉన్న అధికారం నిలుపుకునేందుకు అధికార బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది.
కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అధికార బీజేపీలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది. టికెట్లుపై ఆశ పడి భంగపడిన నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది బీజేపీని వీడారు.
Helicopter Faces Landing Issues: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడడంతో.. అసలు ఏం జరుగుతుందనే అయోమయం నెలకొంది కాసేపు.. ఆ తర్వాత పైలట్ సురక్షితంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీఎస్ యడియూరప్ప ఈ రోజు ఉదయం హెలికాప్టర్‌లో కలుబుర్గికి బయలుదేరి వెళ్లారు.. అయితే,…
ఓ సీనియర్ పొలిటీషనర్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించే సూచనలు చేశారు.. కర్ణాటక రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంకేతాలు ఇచ్చారు.. ఇప్పటి వరకు తాను ప్రాతినథ్యం వహిస్తూ వచ్చిన శికరైపుర అసెంబ్లీ స్థానాన్ని ఖాళీ చేస్తున్నాను.. ఇకపై తన కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర అక్కడి నుంచి బరిలోకి దిగుతారని.. రానున్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి…
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప శకం ముగిసినట్టేనా? అనే చర్చ మొదలైంది… ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం.. ఎందుకంటే.. తన కుమారుడు విజయేంద్రకు కర్ణాటక డిప్యూటీ సీఎం పదవి ఇప్పించాలని, లేదంటే మంత్రి పదవితో పాటు కీలకమైన శాఖలు అప్పగించాలని అనేక ప్రయత్నాలు చేశారు.. కానీ, ఆయనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 29 మంది మంత్రుల్లో తన కొడుకు కూడా ఒక్కడిగా ఉంటాడని ఊహించుకున్న…
రాజీనామా వ్యవహారంపై వస్తున్న వార్తలను ఖండిస్తూనే వచ్చిన కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. చివరకు రాజీనామా చేశారు.. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను కలిసిన ఆయన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అయితే, కొత్త సీఎంను ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని యడియూరప్పను కోరారు గవర్నర్.. ఇక, యడియూరప్ప వారసుడు ఎవరు? కర్ణాటక సీఎం పీఠంపై కూర్చోబోతున్న కొత్త వ్యక్తి ఎవరు అనేదానిపై బీజేపీ అధిష్టానం తీవ్రమైన కసరత్తు చేస్తోంది.. ఇదే సమయంలో.. యడియూరప్పకు బీజేపీ అధిష్టానం…
యడియురప్ప.. కర్నాటకలో బీజేపీకి బలమైన నాయకుడు..! లింగాయత్ వర్గానికి చెందిన యడియురప్ప.. బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగారు. పార్టీ నుంచి బయటికి వచ్చినా.. ఆయన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అలాంటి యడియురప్పకు జులై నెల అంటే టెన్షన్ పట్టుకుంటోంది. ఆయన రెండుసార్లు ఇదే నెలలో బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008లో యడియురప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ ఆ పదవిలో ఎక్కువ సమయం ఉండలేకపోయారు. మూడేళ్లకే ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంటే 2011…