Helicopter Faces Landing Issues: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడడంతో.. అసలు ఏం జరుగుతుందనే అయోమయం నెలకొంది కాసేపు.. ఆ తర్వాత పైలట్ సురక్షితంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీఎస్ యడియూరప్ప ఈ రోజు ఉదయం హెలికాప్టర్‌లో కలుబుర్గికి బయలుదేరి వెళ్లారు.. అయితే, జెవారీలో హెలికాప్టర్ ల్యాండ్ కావాల్సి ఉంది.. కానీ, ల్యాండింగ్ సమయంలో హెలిప్యాడ్ పక్కనే ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, దుమ్ము, కాగితాలు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాయి.. ఇక, ఆ దుమ్ము, దూలి మధ్యలో హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడం పైలట్‌కు సవాల్‌గా మారిపోయింది.. చేసేది ఏమీలేక.. హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయకుండా.. ఆకాశంలోనే చక్కర్లు కొట్టారు కాసేపు.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. హెలిప్యాడ్ క్లియర్ చేయడంతో.. ఆ తర్వాత హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అయితే, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
Read Also: Vellampalli Srinivas: ఎన్నికల తర్వాత బాబు, పవన్, లోకేష్ పనిబడతాం.. వాళ్లు ఏమీ XXలేరు
ఇదిలావుండగా, కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు, బీజేపీ అనుభవజ్ఞుడైన బీఎస్ యడియూరప్పను కూడా ఎన్నికల ప్రచారంలో కీలకంగా ఉపయోగించుకుంటుంది.. యడియూరప్ప కలబురగిలో బీజేపీ ‘జన సనకల్ప యాత్ర’లో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. ప్రమాదం తప్పడంతో.. బీజేపీ శ్రేణులు, యడియూరప్ప అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక, ఎన్నికల ప్రచార సమయంలో.. రోడ్డు మార్గంలో వెళ్తే.. ఎక్కువ సమయం పడుతుంది గనుక.. ఆర్థికంగా బలంగా ఉన్న పార్టీలు హెలికాప్టర్‌లు వాడడం తరచూ చూస్తూనే ఉంటాం.